లారీ క్యాబిన్లో ఆకస్మికంగా మంటలు చెలరేగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్ అల్వార్ జిల్లా రామ్‌గఢ్‌లో జరిగింది.
ఆడుకునేందుకు వెళ్లి...
గోవింద్గఢ్ ఠాణా పరిధిలోని చౌమ గ్రామానికి చెందిన ఓ డ్రైవర్ దిల్లీ నుంచి తిరిగివచ్చి తన లారీని రోడ్డుకు ఓ పక్కన పార్క్ చేశాడు. అయితే.. నలుగురు పిల్లలు ఆడుకునేందుకు ఆ లారీ ఎక్కారు. ఇంతలోనే ఆ లారీ క్యాబిన్లో మంటలు చెలరేగాయి.
![fire accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11694208_674_11694208_1620542996947.png)
మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన స్థానికులు.. పిల్లలను వాహనం నుంచి బయటకు తీసి అల్వార్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడం వల్ల వారిని జైపూర్‌కు తీసుకెళ్లమని అల్వార్ ఆసుపత్రి వైద్యులు సూచించారు. ఈ క్రమంలో జైపూర్‌కు తరలిస్తుండగా ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.
లారీ ముందు భాగం కూడా పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. రామ్‌గఢ్ పోలీసు అధికారి రామ్నివాస్, డీఎస్పీ ఓంప్రకాశ్ మీనా ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.