కేరళ కొల్లాం జిల్లాలోని కుందరా పట్టణంలో పసిపాపను కన్నతల్లే గొంతునులిమి చంపిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ కేసులో పుతూర్ సౌత్‌కు చెందిన డాక్టర్ బాబులు భార్య దివ్య(25)ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇదీ జరిగింది
మాయంకోడ్లోని దివ్య ఇంటికి.. తన తండ్రి జన్నీ సెబాస్టియన్ వెళ్లి, తలుపు తీయమన్నాడు. అయితే అందుకు నిరాకరించిన దివ్య.. ఆయన ప్రాదేయపడగా ఎట్టకేలకు తలుపు తెరిచింది. వెంటనే ఇంటి లోపలికి వెళ్లిపోయింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన.. సెబాస్టియన్ లోపలికి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడిఉన్న పాప మృతదేహాం కనిపించింది. దీంతో పాపను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే పాప మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.
మానసిక అనారోగ్యమే కారణమా?
పాపకు జన్మనిచ్చిన తర్వాత దివ్య మానసిక ఆరోగ్యం క్షీణించినట్లు ఆమె బంధువులు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో పాప వద్ద దివ్య మాత్రమే ఉన్నట్లు బంధువులు చెప్పారు. గతంలోనూ దివ్య ఓ సారి ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు.
దివ్య మానసిక అనారోగ్యానికి గురైన తర్వాత పాపను చూసుకోవటానికి ఓ మహిళను నియమించినట్లు బంధువులు పేర్కొన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత తన ఆరోగ్యం మెరుగుపడిందని.. తనకు ఇకపై సహాయకులు అవసరం లేదని దివ్య చెప్పినట్లు వివరించారు.
ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో అత్యాచార బాధితురాలి తండ్రి మృతి