తమిళనాడులోని చెన్నైలో దొంగలు రెచ్చిపోయారు. ఓ బంగారు దుకాణం షట్టర్‌ను వెల్డింగ్ మిషన్‌తో కత్తిరించి లోపలికి చొరబడ్డారు. లాకర్ గదిని కూడా కత్తిరించి దోపిడీకి పాల్పడ్డారు. తొమ్మిది కిలోల బంగారం, రూ.20 లక్షల విలువచేసే డైమండ్‌ను ఎత్తుకెళ్లారు.
![Thieves Stolen 9 kilogram Gold in Chennai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17716451_gold3.jpg)
![Thieves Stolen 9 kilogram Gold in Chennai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17716451_gold.jpg)
![Thieves Stolen 9 kilogram Gold in Chennai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17716451_gold1.jpg)
![Thieves Stolen 9 kilogram Gold in Chennai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17716451_gold2.jpg)
ఎప్పటిలాగే గురువారం రాత్రి నగల దుకాణాన్నిమూసివేశాడు. అయితే శుక్రవారం ఉదయం షాప్ తెరిచేందుకు శ్రీధర్ తన షాపునకు వచ్చి చూసేసరికి షాక్‌కు గురయ్యాడు. దుకాణ షట్టర్‌ను గుర్తుతెలియని దుండగులు వెల్డింగు మిషన్‌తో కత్తిరించి దోపిడీ చేశారు. లాకర్ గదిని తెరచి చోరీకి పాల్పడ్డారు. తొమ్మిది కిలోల బంగారం, రూ.20 లక్షలు విలువచేసే వజ్రాన్ని దోచుకెళ్లారు. భవనంలోని సీసీటీవీ హార్డ్ డిస్క్‌ను కూడా ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.