దొంగలు చేసిన పనికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామం మొత్తం రోజంతా అంధకారంలోకి వెళ్లింది. ట్రాన్స్ఫార్మర్ను విప్పదీసి అందులోని రాగి వైర్లను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దొంగలు. సోమవారం రాత్రి దొంగలు ఈ ఘటనకు పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్‌లో జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాత్రిపూట దొంగలు ట్రాన్స్ఫార్మర్ను విప్పదీసి అందులోని రాగి వైర్లను ఎత్తుకెళ్లారు. దీంతో ఘటన జరిగినప్పటి నుంచి మంగళవారం వరకు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఘటన జరిగిన సమయంలో పెద్ద ఎత్తున పొగ రావడం వల్ల.. స్థానికులు దొంగలను గుర్తించలేకపోయారు.
![Wires in transformer stolen in Uttar Pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-gzb-01-transformer-vis-dlc10020mp4_27122022171309_2712f_1672141389_675.jpg)
![Wires in transformer stolen in Uttar Pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-gzb-01-transformer-vis-dlc10020mp4_27122022171309_2712f_1672141389_447.jpg)
విప్పదీసిన ట్రాన్సఫార్మర్ను స్వాధీనం చేసుకున్న గ్రామస్థులు.. అందులో రాగి వైర్లు చోరికి గురైనట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా విద్యుత్తు శాఖ కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి, కరెంట్ సరఫరాను పునరుద్ధరించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
![Wires in transformer stolen in Uttar Pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-gzb-01-transformer-vis-dlc10020mp4_27122022171309_2712f_1672141389_706.jpg)