కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఘనవిజయం సాధించిన సీఎం పినరయి విజయన్.. మే 18 తర్వాతే ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో వైరస్ నియంత్రణకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
ప్రమాణాస్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరపనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 17న నిర్వహించనున్న పార్టీ భేటీలో మంత్రి పదవుల కేటాయింపుపై చర్చించనున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయం సాధించిన నేపథ్యంలో విజయన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కోరిక మేరకు తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ 99 స్థానాల్లో గెలుపొంది రెండోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్ 41 స్థానాలకే పరిమితమైంది. భాజపా ఖాతా తెరవలేకపోయింది.
ఇదీ చూడండి: 'ప్రతిపక్షాల ఐక్యతకు పవార్ కృషి'