ETV Bharat / bharat

యువత బలంతో ఉన్నత శిఖరాలకు భారత్​: మోదీ - pm modi news

భారత దేశానికి యువతే అభివృద్ధి ఛోదకులన్నారు ప్రధాని మోదీ. వారికి 2022 ఎంతో కీలకమన్నారు. యువత వల్లే డిజిటల్ పేమెంట్స్​లో భారత్​ దూసుకుపోతోందని కొనియాడారు.

PM Modi
యువత బలంతో ఉన్నత శిఖరాలకు భారత్​: మోదీ
author img

By

Published : Jan 12, 2022, 12:15 PM IST

Updated : Jan 12, 2022, 12:55 PM IST

భారతదేశానికి రెండు అపరిమిత శక్తులు ఉన్నాయని ప్రపంచం అంగీకరించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అవి జనాభా, ప్రజాస్వామ్యం అని చెప్పారు. యువతను భారత్​ అభివృద్ధి ఛోదకులుగా పరిగణిస్తుందని చెప్పారు. పుదుచ్చేరిలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల(ఎంఎస్​ఎంఈ) సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆత్మనిర్భర్ భారత్​లో ఎంస్​ఎంఈ పాత్ర చాలా కీలకం. ప్రపంచాన్ని మార్చే సాంకేతికతను ఎంఎస్​ఎంఈ రంగంలో ఉపయోగించడం చాలా కీలకం. ఈ కొత్త కేంద్రం ఆ దిశగా కీలక ముందడుగు అవుతుంది. భారత్​కు యువతే బలం. 2022 వారికి చాలా కీలకం. యువత వల్లే దేశంలో డిజిటల్​ పేమెంట్స్ దూసుకుపోతున్నాయి. అన్ని తరాలకు యువతే ఆదర్శం. స్వాతంత్ర్య సమర యోధుల కలలను యువతే సాకారం చేయాలి. 15-18ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్​ ప్రారంభమైనప్పటి నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 2కోట్లకుపైగా పిల్లలు టీకా తీసుకున్నారు. మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్ల పెంచింది కూడా మన బిడ్డల జీవితాలను మెరుగుపరిచి మరిన్ని అవకాశాలు కల్పించేందుకే.'

-ప్రధాని నరేంద్ర మోదీ.

25 జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరి కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. ప్రస్తుతం భారత్​లో 50వేల అంకుర సంస్థలకు అనువైన వాతావరణం ఉందన్నారు. కొవిడ్ కష్టకాలంలో కఠిన సవాళ్లు ఎదురైనప్పటికీ గత ఆరేడు నెలల్లోనే 10వేల అంకురాలు పుట్టుకొచ్చినట్లు చెప్పారు. 'పోటీపడు, విజయం సాధించు' అనేదే నవభారత్​ ఆచరిస్తున్న మంత్రం అన్నారు.

ఇదీ చదవండి: ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై విచారణకు సుప్రీం కమిటీ

Last Updated : Jan 12, 2022, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.