ETV Bharat / bharat

22 ఏళ్లుగా గదిలో బందీగా మహిళ.. కుటుంబసభ్యులే కట్టేసి.. - woman tied up for 22 years in india

Woman Tied Up For 22 Years: 22 ఏళ్లుగా ఓ మహిళను ఇంట్లోనే బంధించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన గుజరాత్​లోని సూరత్​లో వెలుగుచూసింది. స్థానిక ఎన్​జీఓ సహకారంతో ఆమెకు బందీ నుంచి విముక్తి కలిగింది.

woman tied up for 22 years
22 ఏళ్లుగా మహిళను బంధించిన కుటుంబ సభ్యులు
author img

By

Published : Apr 15, 2022, 8:27 AM IST

Woman Tied Up For 22 Years: ఓ మహిళను 22 ఏళ్లుగా ఇంట్లోనే బంధించారు కుటుంబ సభ్యులు. ఈ అమానవీయ ఘటన గుజరాత్​లోని సూరత్​లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గంగాబా చారిటబుల్​ ట్రస్ట్​ అనే ఓ ఎన్​జీఓ ఆమెను విడుదల చేయించింది. సూరత్​లోని ఉదానాకు చెందిన బాధితురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా గదిలో బంధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

woman tied up for 22 years
22 ఏళ్లుగా మహిళను బంధించిన కుటుంబ సభ్యులు

'మీకే ఇబ్బంది': బాధితురాలిని విడుదల చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదని వెల్లడించారు ఎన్​జీఓ సభ్యులు జాల్పాబెన్ సొనానీ. బాధితురాలు తన కర్మఫలాలను అనుభవిస్తోందని ఆమె భర్త పేర్కొన్నారని తెలిపారు. "మమల్ని అమ్మ బాగా హింసించేది, ఆ సమయంలో మమ్మల్ని ఎవరూ ఆదుకోలేదు. మీరు ఒకవేళ ఆమెను బలవంతంగా తీసుకెళ్తే మీపైన కూడా ఆమె దాడి చేస్తుంది" అని బాధితురాలి పిల్లలు తమను హెచ్చరించినట్లు చెప్పుకొచ్చారు సొనానీ. చివరకు పోలీసులు సాయంతో ఆమెకు బందీ నుంచి విముక్తి కలిగించామని తెలిపారు.

ఇదీ చదవండి: విద్యార్థుల మతమార్పిడికి యత్నం.. మహిళా టీచర్​ సస్పెండ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.