హిమపాతం కారణంగా మూసుకుపోయిన మనాలీ-లేహ్ మార్గాన్ని 'సరిహద్దు రహదారి సంస్థ'(బీఆర్వో) రికార్డు సమయంలో పునఃప్రారంభించింది. ఆదివారం నుంచి ఈ రోడ్డుపై ట్రాఫిక్‌ను అనుమతించింది. షెడ్యూలుకు నెలన్నర ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ రోడ్డును ఏటా శీతాకాలంలో దాదాపు ఆరు నెలలపాటు మూసివేస్తారు. దీంతో లద్ధాఖ్‌కు దేశంలోని మిగతా ప్రాంతాలకు మధ్య రాకపోకలు నిలిచిపోతాయి.
ఈ సమయంలో వాయు మార్గంలోనే అక్కడికి సరకులను పంపాల్సి ఉంటుంది. 425 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో మంచును తొలగించే ప్రక్రియ గత నెల మధ్యలో ప్రారంభమైంది. ఈ దఫా..నాలుగు ముఖ్యమైన పర్వత సానువుల్లో ఏకకాలంలో మంచు తొలగింపు ప్రక్రియను బీఆర్వో చేపట్టింది. దీంతో నెలన్నర ముందే ఈ కసరత్తు పూర్తయింది.
ఇదీ చదవండి: సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రనేడ్ దాడి