ETV Bharat / bharat

భారత్- ‌చైనా మధ్య 10వ విడత చర్చలు - భారత్​ చైనా తాజా భేటీ

భారత్​-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఇరు దేశాలూ మరోసారి సమావేశమయ్యాయి. పాంగాంగ్​ సరస్సు ప్రాంతంలో సైనిక బలగాల ఉపసంహరణ అనంతరం.. మిగతావాటిపైనా ఇదే స్థాయిలో చర్చలు జరగుతున్నట్టు తెలుస్తోంది.

The 10th round of Corps Commander level talks between India and China
భారత్-‌చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు
author img

By

Published : Feb 20, 2021, 1:16 PM IST

తూర్పు లద్దాఖ్​లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో సైనిక బలగాల ఉపసంహరణ నేపథ్యంలో.. భారత్-చైనాల మధ్య శనివారం కమాండర్ స్థాయిలో పదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మాల్డో పోస్టు వద్ద ఈ భేటీ మొదలైంది.

ఈ చర్చల్లో భారత్ తరఫున లేహ్​లోని 14వ క్రాప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్, చైనా తరఫున మేజర్ జనరల్ లియు లిన్ పాల్గొంటున్నారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ పూర్తికావడం వల్ల.. మిగతా ప్రాంతాలపై ఈ చర్చల్లో దృష్టి సారించనున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. హాట్ స్ర్పింగ్స్, గోర్గా, దేశ్​పాంగ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల నివారణ చర్యలపై.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: గల్వాన్​ ఘర్షణపై చైనా 'బూటకపు' వీడియో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.