జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో ఓ ఉగ్ర అనుచరుడిని అధికారులు అరెస్టు చేశారు. అతని నుంచి భారీగా ఆయుధాలు, నగదుతో సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
![Terrorist associate held](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09:43:21:1620749601_11725097_304_11725097_1620748853038.png)
పక్కా సమాచారంతో కుప్వారా పోలీసులు.. ఆర్మీకి చెందిన 17 ఆర్‌ఆర్, 160 టీఏలతో కలిసి క్రాల్‌పోరా రేషి గుండ్ వద్ద చెక్‌పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తనిఖీ నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. అతని నుంచి 12 గ్రనేడ్లు, ఏకే-47 తుపాకులు సహా రూ.1,69,500 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అతన్ని గారారయల్ కుప్వారా నివాసి అబ్దుల్ గని లోన్ కుమారుడు అబ్దుల్ అహాద్ లోన్‌గా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి