ETV Bharat / bharat

యూపీలో రాముని గుడిని అమ్మిన పాకిస్థానీ

Ram Temple Sold By Pakistani: ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లోని రామ్​జానకీ దేవాలయాన్ని విక్రయించాడు ఓ పాకిస్థాన్​ జాతీయుడు. అక్కడ నివసిస్తున్న 18 హిందూ కుటుంబాలను తరలించాడు. దీనిపై స్పందించిన అధికారులు దానిని శత్రు ఆస్తులుగా ప్రకటించారు.

Kanpur news
Kanpur news
author img

By

Published : May 19, 2022, 12:23 PM IST

Ram Temple Sold By Pakistani: పాకిస్థాన్ జాతీయుడు ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లోని రామ్​జానకి దేవాలయాన్ని విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మరో ఆస్తిని విక్రయించినట్లు కాన్పూర్​ అధికారులు వెల్లడించారు. దీనిపై స్పందించిన శత్రు ఆస్తుల నిర్వహణ విభాగం అధికారులు.. వాటిని శత్రు ఆస్తులుగా ప్రకటించారు. ఆలయాన్ని కొనుగోలు చేసి కూల్చివేసి హోటల్​ను నిర్మించిన వారికి నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. తాము అడిగిన ఐదు నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు రెండు వారాల సమయం ఇచ్చామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి స్పందన రాలేదని శత్రు ఆస్తుల విభాగం అధికారులు తెలిపారు.

పాకిస్థాన్​ కుటుంబానికి చెందిన అబిద్​ రెహ్మాన్ 1962లో ఆ దేశానికి వలస వెళ్లాడు. తర్వాత 1982లో తిరిగి వచ్చి కాన్పూర్​ బెకాన్​గంజ్​లోని తన ఆస్తిని సైకిల్​ షాప్​ నిర్వహించే ముఖ్తార్​ బాబాకు విక్రయించాడు. దీంతో ఆస్తిని కొన్న ముఖ్తార్​ అక్కడ నివసిస్తున్న 18 హిందూ కుటుంబాలను అక్కడి నుంచి తరలించి.. ఓ హోటల్​ను నిర్మించాడు. కాగా కాన్పూర్​ మున్సిపల్​ కార్పోరేషన్​ రికార్డుల ప్రకారం ఆస్తి.. ఆలయంగా నమోదు అయ్యింది. ఈ విషయంపై గతేడాది శత్రు సంఘర్షణ సమితి అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో దీనిపై విచారణ చేపట్టాలని జాయింట్​ మేజిస్ట్రేట్​ను ఆదేశించారు జిల్లా మేజిస్ట్రేట్. దీనిపై స్పందించిన ముఖ్తార్​ బాబా కుమారుడు మహ్మద్​ ఉమర్​.. తన వద్ద ఆస్తి పత్రాలు ఉన్నాయని.. అధికారుల ప్రశ్నలకు త్వరలోనే సమాధానం ఇస్తానని చెప్పారు.

ఇదీ చదవండి: దేశ విభజన ఆగినట్లే ఆగి.. నెహ్రూ రాకతో తలకిందులై..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.