ETV Bharat / bharat

CBN birthday: చంద్రబాబు 74వ జన్మదిన వేడుకలు..వెల్లువెత్తిన శుభాకాంక్షలు.. అందరికీ ధన్యవాదాలు - Chandrababu 74th birthday wishes twitter news

Nara Chandrababu Naidu 74th birthday celebrations news: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా పార్టీలకు అతీతంగా .. ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సినీ ప్రముఖులతో పాటు కేంద్రమంత్రులు, ప్రతిపక్షాల నేతలతో పాటు పలువురు వైఎస్సార్​సీపీ నేతలు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపుతూ.. ట్వీట్ చేశారు.

Chandrababu
Chandrababu
author img

By

Published : Apr 20, 2023, 5:39 PM IST

Updated : Apr 20, 2023, 7:31 PM IST

Nara Chandrababu Naidu 74th birthday celebrations news: తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నేటితో 73 సంవత్సరాలను పూర్తి చేసుకుని 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు సినీ హీరోలు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు.

మెగస్టార్ చిరంజీవి.. అందులో మొదటగా తెలుగు చిత్రసీమ పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరుగాంచిన చిరంజీవి ట్విటర్ వేదికగా నారా చంద్రబాబు నాయుడుకి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి.. ''శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.'' అని పేర్కొన్నారు.

సత్యకుమార్ యాదవ్.. అనంతరం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ..''తెలుగుదేశం పార్టీ అధిపతికి జన్మదిన శుభాకాంక్షలు@జైటీడీపీ&ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం@ncbn గారు. ఆయనకు సంతోషకరమైన, ఆరోగ్యవంతమైన జీవితం ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.'' అంటూ పేర్కొన్నారు.

వైసీపీ ఎంపీ, కేంద్ర సహాయశాఖ మంత్రి.. 'టీడీపీ అధినేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తున్నాను.' అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ట్విటర్ వేదికగా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి అయిన భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ కూడా ట్విటర్‌లో.. 'ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు@ncbnజి. భగవాన్ శ్రీ రామ్ జీ మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుని ఇవ్వాలని కోరుకుంటున్నాను.' అని ఆయన తెలిపారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరి.. కేంద్ర రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరి సైతం నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. 'తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువుతో ఆశీర్వదించబడాలి@ncbn.' అని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత 'ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ@ncbn గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.' ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు చంద్రబాబుకు బర్త్ డే విషెష్ చెప్పారు.

73 కిలోల కేక్‌ను కట్ కటింగ్.. మరోవైపు చంద్రబాబు నాయుడు 73 సంవత్సరాలు పూర్తి చేసున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు కేకులు కట్ చేసి పలు సేవ కార్యక్రమాలను నిర్వహించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, టీడీ జనార్దన్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, మన్నవ మోహనకృష్ణ, జలీల్‌ఖాన్‌ తదితరులు పాల్గొని.. 73 కిలోల కేక్‌ను కట్ చేశారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం కావాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరారు.

అందరికీ ధన్యవాదాలు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ట్విట్టర్‌లో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో.. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అందులో ఎంపీలు విజయ సాయి రెడ్డి, లావు కృష్ణదేవరాయలకు, కొంతకాలంగా వైఎస్సార్సీపీకి దూరంగా ఉంటున్న పీవీపీ (పొట్లూరి వరప్రసాద్) కూడా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు బీజేపీ ఎంపీలకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, మెగాస్టార్‌ చిరంజీవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పీసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలకు కూడా చంద్రబాబుకు ధన్యవదాలు తెలిపారు. అయితే, సీఎం జగన్ చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు చెప్పనప్పటికీ అధికార పార్టీ ఎంపీలు, నేతలు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేయడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఇవీ చదవండి

Last Updated : Apr 20, 2023, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.