ETV Bharat / bharat

'టెలీ-లా'తో 4 లక్షల మందికి న్యాయసేవ

ప్రజలకు న్యాయ సలహాలు అందించే టెలీ-లా కార్యక్రమం సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2017లో ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాది అక్టోబర్​ వరకు 4 లక్షల మంది సాధారణ సేవా కేంద్రాల (సీఎస్​సీ) ద్వారా లబ్ధి పొందారని కేంద్రం వెల్లడించింది.

Tele-law
టెలీ-లా
author img

By

Published : Nov 4, 2020, 7:17 AM IST

కేంద్రం తీసుకొచ్చిన 'టెలీ-లా' కార్యక్రమం కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 30 వరకు సాధారణ సేవా కేంద్రాల (సీఎస్‌సీ) ద్వారా 4 లక్షల మంది లబ్ధిదారులు న్యాయ సలహాలు పొందినట్లు కేంద్ర చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ కార్యక్రమం ప్రారంభం నాటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 1.95 లక్షల మంది లబ్ధి పొందారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడు నెలల్లో మరో 2.05 లక్షల మందికి న్యాయ సలహాలు అందాయి.

పంచాయతీ స్థాయి నుంచి..

'డిజిటల్‌ ఇండియా విజన్‌'లో భాగంగా అందరికీ న్యాయాన్ని అందుబాటులోకి తేవడానికి కేంద్రం స్వదేశీ డిజిటల్‌ వేదికలను ఉపయోగిస్తోంది. కేసుల వరకు వెళ్లకుండా వివాదాలను పరిష్కరించేందుకు 'టెలీ-లా' కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించింది. ఇందులో పంచాయతీ స్థాయి నుంచి సీఎస్​సీ వరకు వీడియో కాలింగ్‌ లేదా టెలిఫోన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వీటి ద్వారా ప్రజలు న్యాయవాదులకు ఫోన్‌ లేదా వీడియో కాల్‌ చేసి సరైన సమయంలో విలువైన న్యాయ సలహా పొందవచ్చు.

క్షేత్ర స్థాయిలో దరఖాస్తుదారుల ముందస్తు నమోదు, అపాయింట్‌మెంట్‌ ఖరారు కోసం నాల్సా, సీఎస్​సీ వలంటీర్ల వద్ద మొబైల్‌ యాప్‌ ఉంటుంది. ప్రజలకు నిరంతర న్యాయ సలహాలు అందించేందుకు న్యాయవాదుల బృందం అందుబాటులో ఉంటుంది.

ఇదీ చూడండి: నకిలీ ప్రభుత్వ పథకాలతో ఆన్​లైన్ మాయాజాలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.