ETV Bharat / bharat

Telangana Government Letter to Central Water Commission : పోలవరం బ్యాక్‌ వాటర్​పై కేంద్ర జలసంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు - తెలంగాణ ఈఎన్సీ మురళీధర్

Telangana Government Letter to Central Water Commission
Telangana Government
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 2:50 PM IST

Updated : Sep 27, 2023, 3:39 PM IST

14:39 September 27

Telangana Government Letter to Central Water Commission : పోలవరం బ్యాక్‌ వాటర్​పై కేంద్ర జలసంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు

Telangana Government Letter to Central Water Commission : పోలవరం బ్యాక్ వాటర్స్ విషయంలో తమ అభ్యంతరాలు, వినతులను పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్(CWC Chairman)​కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. పోలవరం బ్యాక్ వాటర్స్(Polavaram Backwaters) కారణంగా రాష్ట్రంలోని 954 ఎకరాలు ముంపునకు గురవుతాయని.. ఇతర ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని గతంలో పలుమార్లు పేర్కొన్నట్లు తెలిపారు. తాము లేవనెత్తిన తొమ్మిది అంశాల్లో ఒక్కదానిపై కూడా చర్య తీసుకోలేదని అన్నారు.

Telangana Letter to Central Water Commission : ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని.. పీపీఏ(PPA) నుంచి సమన్వయ లోపం ఉందని లేఖలో మురళీధర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించినట్లు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని.. సీడబ్ల్యూసీ, పీపీఏ సమావేశాల్లో ఇచ్చిన హామీలు కంటితుడుపుగానే మిగిలిపోయాయని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. తక్షణమే తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

Telangana ENC on Polavaram Back water : మరోవైపు గతంలో పోలవరం ప్రాజెక్టు వెనక జలాలతో రాష్ట్ర భూభాగంలో ముంపు ఏర్పడుతోందని రాష్ట్రం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి సర్వే చేపట్టి ముంపు పరిధిని గుర్తించే వరకు జలాశయంలో నీటిని నిల్వ చేయవద్దని పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

Telangana Letter to Polavaram Project Authority : 'ముంపు తేల్చేవరకు 'పోలవరం'లో నిల్వ వద్దు'

Polavaram Project Latest News in Telugu : పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం(Water Level) ఎఫ్‌ఆర్‌ఎల్‌-150 అడుగుల వద్ద నీటిని నిల్వ చేస్తే.. తెలంగాణలో 899 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. గతేడాది జులైలో వచ్చిన భారీ వరదలకు(Floods) ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండి వెనక జలాలు పోటెత్తాయి. అయితే ఏపీ మాత్రం నీటి నిల్వ లేదని చెబుతోందని వెల్లడించిన ఈఎన్సీ.. నిల్వకు సంబంధించిన ఆధారాలు పంపుతూ రివర్‌ క్రాస్‌ సెక్షన్లు(River Cross Sections), వరద అంచనా, ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి వివరించారు. సుప్రీం సూచనలు, కేంద్ర జలసంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి సర్వే పూర్తి కానందున ఈ ఏడాది నీటి నిల్వ చేయొద్దని సూచించారు.

పోలవరం ముంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం చేపట్టవద్దని 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. కోర్టు ఉమ్మడి సర్వే చేపట్టాలని సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(Polavaram Project Authority)ను కోరిందని వెల్లడించారు. సుప్రీం ఆదేశాల మేరకు సాంకేతిక కమిటీ సమావేశాలు నిర్వహించి పోలవరం ప్రాజెక్టు సమాచారాన్ని ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకోవాలని పేర్కొన్నట్లు తెలిపారు.

TS Govt Letter to KRMB : కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

కృష్ణా జలాల తరలింపును నిలిపివేయండి.. తుంగభద్ర బోర్డుకు ప్రభుత్వం లేఖ

Last Updated : Sep 27, 2023, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.