Telangana Govt Offer Rs 1 Lakh BC communities : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బీసీ కులవృత్తులు, చేతి వృత్తులకు రూ. లక్ష ఆర్థికసాయం కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన సంక్షేమ దినోత్సవం రోజు ఆర్థికసాయం పంపిణీని ప్రారంభించనున్నారు. ఆ రోజు మంచిర్యాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ కులవృత్తులకు ఆర్థికసాయాన్ని లాంఛనంగా అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, శాసనసభ్యుల చేతుల మీదుగా లబ్దిదారులకు ఆర్థికసాయం పంపిణీ చేయనున్నారు.
ఇందుకోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా బీసీ సంక్షేమశాఖ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్ ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. సచివాలయంలో జరిగిన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కులవృత్తులు, చేతివృత్తులకు సంబంధించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఆర్థికసాయం అందించనుంది. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6,229 కోట్లను కేటాయించింది.
Financial assistance to Telangana BC communities : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీసీ వర్గాలు, చేతు వృత్తుల్లోని విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, మేదరి, రజక, కుమ్మరి వంటి కులవృత్తులకు రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందనుంది. ఇందుకు సంబంధించిన విషయాన్ని గత నెలలో జరిగిన కేబినెట్ మీటింగ్‌లోనే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు విధి విధానాలను కూడా రూపొందించారు. ఈ ఆర్థిక సాయానికి ఎంపికైయ్యే లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించింది. అందుకు వెబ్సైట్లో దరఖాస్తుకు ఆహ్వానించారు.
ఇతర పథకాల వివరాలు : ఇప్పటికే తెలంగాణ సర్కార్ అన్ని వర్గాల వారి సంక్షేమానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే దళితబంధు స్కీమ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల్లో అర్హులకు రూ.10 లక్షల సాయాన్ని అందిస్తున్నారు. మరోవైపు బీసీల్లోని గీత కార్మికులకు ప్రభుత్వమే ప్రత్యేకంగా రూ. 5 లక్షల పాలసీని చేయిస్తోంది. వారిని ప్రోత్సహించడానికి నీరా కేఫ్‌ను హుస్సేన్ సాగర్ నడిబొడ్డును ఏర్పాటు చేసింది. అలాగే మత్స్య సోదరులకు రాయితీలపై చేప పిల్లలను అందిస్తున్నారు. రాష్ట్రంలో 3.65 లక్షల మంది మత్స్యకారులు సభ్యత్వం తీసుకున్నారు. రైతులకు రైతు బంధు పథకం ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకే రూ.5 వేలను జమ చేస్తున్నారు. అలాగే రైతులకు రుణమాఫీ కింద దాదాపు రూ. 6వేల కోట్లను మాఫీ చేశారు.
ఇవీ చదవండి :