బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ అక్కడి పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణ ఓ 16 ఏళ్ల బాలుడిని బలితీసుకుంది. ఈ ఘటన ఉత్తర 24పరగణా జిల్లాలో జరిగింది.
ఖుదీరామ్ పల్లీలో మొదట రెండు గ్రూపుల మధ్య చిన్న గొడవ జరిగింది. క్రమేపి వారిమధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడిని కొట్టారు. తీవ్ర గాయాలైన ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గాయాలపాలైన పలువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: 'టీఎంసీ రాజకీయాలతో దేశ భద్రతకే ముప్పు'