Teenager Burnt Alive: ఉత్తర్‌ప్రదేశ్ బరేలీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికను సజీవదహనం చేశారు దుండగులు. నిందితుల్లో బాధితురాలి ప్రియుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంట్లో వేర్వేరు గదుల్లో పనిచేసుకుంటుండగా.. కొందరు యువకులు వచ్చి యువతిపై దాడి చేశారని పోలీసులకు వివరించింది బాధితురాలి తల్లి. కిరోసిన్ పోసి నిప్పంటించి.. అక్కడి నుంచి పారిపోయారని చెప్పింది.
''ఘటనా సమయంలో నా భర్త ఇంట్లో లేడు. రైస్ మిల్లులో పని కోసం వెళ్లాడు. ఇద్దరు కుమారులు కూడా బయటకు వెళ్లారు.''
- బాధితురాలి తల్లి
బాధిత యువతిని బహేదిలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లగా.. బరేలీకి తరలించాలని వైద్యులు చెప్పారు. అక్కడికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయింది యువతి. నిందితుల్లో ఒకరితో ఆమె ప్రేమ వ్యవహారం నడిపినట్లు.. పోలీసులకు సమాచారం అందింది.
ఘటనా స్థలం నుంచి యువతి దుస్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: పాక్ టీనేజర్‌తో భారతీయురాలి 'లూడో లవ్'- బోర్డర్ క్రాస్ చేసేలోగా...