మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు కామాంధులు. నిందితుల్లో ఓ మైనర్ ఉన్నాడు. నిందితులందర్ని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీనేజర్‌పై శుక్రవారం ఓ వ్యవసాయ క్షేత్రంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితులు. బాధితురాలి తల్లిదండ్రులు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మైనర్ నిందితుడిని జువైనల్ హోంకు తరలించారు. మిగతా నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు. ఐదుగురు నిందితులకి ఆగస్టు 17 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు.
మైనర్‌పై గ్యాంగ్ రేప్..
మరోవైపు, కేరళలో మైనర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధులు. ఈ ఘటన త్రిస్సూర్‌లో జరిగింది. నిందితుల్లో ఒకర్ని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కిందకేసు నమోదు చేసుకున్నారు. రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి తన బిడ్డపై జరిగిన దారుణాన్ని ఎవరకి తెలియనివ్వలేదు. ఇటీవల బాధితురాలు తన టీచర్‌తో జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో ఈ విషయం బయటపడింది. నిందితులు.. బాధితురాలి తండ్రికి స్నేహితులు. నిత్యం బాధితురాలు ఇంటికి వస్తూ ఉండేవారు. వీరందరూ కలిసి గంజాయి వ్యాపారం చేస్తుండేవారు.
కిడ్నాప్ చేసి హత్యాచారం..
హరియాణా పానిపట్‌లో మరో ఘోరం జరిగింది. ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. నిందితుడు ఈశ్వర్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పానిపట్‌లోని సెక్టార్ 29లోని తన ఇంటి సమీపంలోని ఓ పార్కులో తన తమ్ముడితో కలిసి ఆరేళ్ల బాలిక ఆడుకుంటోంది. బిస్కెట్ ఇస్తానని నమ్మించి బాలికను కిడ్నాప్ చేశాడు నిందితుడు ఈశ్వర్. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత బాలిక గొంతుకోసి చంపేశాడు. నిందితుడు ఉత్తరాఖండ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడు పానిపట్‌లోని ఓ దాబాలో పనిచేస్తున్నాడు. మైనర్ మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చిన్నారి గొంతు కోసి బాలికను చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: జైలు ఎదుట బిడ్డ మృతదేహంతో తల్లి ఆవేదన, భర్త కోసం 7 గంటలు నిరీక్షించి