ETV Bharat / bharat

పొలానికి వెళ్లిన బాలికపై.. మద్యం తాగించి గ్యాంగ్​రేప్​! - Woman Raped In Public Toilet

Gujarat Girl Gang Raped: పొలానికి వెళ్లిన బాలికను ఎత్తుకెళ్లి.. మద్యం తాగించి గ్యాంగ్​రేప్​కు పాల్పడ్డారు దుండగులు. మరో ఘటనలో రైల్వే స్టేషన్​లో టాయిలెట్​కు వెళ్లిన మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.

Teenage girl gang raped
Teenage girl gang raped
author img

By

Published : Mar 20, 2022, 6:24 PM IST

Gujarat Girl Gang Raped: గుజరాత్ కచ్ జిల్లాలో దారుణం జరిగింది. పొలానికి వెళ్లిన బాలికను ఎత్తుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్​రేప్​కు పాల్పడ్డారు దుండగులు. భుజ్​ శివారులో మార్చి 16న జరిగిన ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

అపస్మారకస్థితిలో పడిఉన్న బాధితురాలిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారని కచ్ ఎస్పీ సౌరభ్ సింగ్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను హుస్సెన్​ కాకల్​(35), రాహుల్ సత్వారా(19), వల్జీ వదియారా(24), మహేశ్​గా (20) గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.

పబ్లిక్ టాయిలెట్​లోనే..

Woman Raped In Public Toilet: పబ్లిక్ టాయిలెట్​లోనే ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​, ప్రతాప్​గఢ్​ రైల్వేస్టేషన్​లో జరిగింది.

ఓ మహిళ.. తన భర్తతో కలిసి స్టేషన్​లో రైలుకోసం ఎదురుచూస్తుంది. కొద్దిసేపటికి ఆమె భర్త టీకోసం వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన వ్యక్తి.. పార్కింగ్ ప్రాంతంలో స్వచ్ఛమైన టాయిలెట్ ఉందని నమ్మించి.. మహిళను అక్కడకు వెళ్లమని చెప్పాడు. మహిళ ఆ గదిలోకి వెళ్లగానే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: మద్యానికి డబ్బులివ్వలేదని కన్నతల్లిని కడతేర్చిన కుమారుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.