పేరుకే వారు దివ్యాంగులు... మనోధైర్యంలో అందరినీ మించినోళ్లు... వేల అడుగుల ఎత్తులోనూ సడలని పట్టుదలతో ముందడుగు వేశారు... ప్రపంచ రికార్డును దాసోహం చేసుకున్నారు.
ఆదివారం సియాచిన్ హిమానీనదంలో (siachen glacier) ఉన్న 15,632 అడుగుల ఎత్తైన కుమార్ పోస్ట్‌కు (kumar post siachen) ఎనిమిది మంది దివ్యాంగులు చేరుకున్నారు. ప్రాణాలను హరించే చల్లటి గాలులు, ఊపిరి కూడా సరిగా తీసుకునే అవకాశం లేని పరిస్థితుల్లో గొప్ప ధైర్యసాహసాలను ప్రదర్శించారు.
'ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్' పేరుతో ఈ పర్వతారోహణ కార్యక్రమం చేపట్టారు. దీనికి భారత సైన్యానికి (Indian Army) చెందిన ప్రత్యేక విభాగాలు సహకరించాయి. ప్రత్యేక దళాల మాజీ సభ్యులతో కూడిన 'క్లా గ్లోబల్' విభాగం ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ (Blue Freedom Operation) విజయంలో కీలకంగా వ్యవహరించిందని.. ఆర్మీ నార్తర్న్ కమాండ్ వెల్లడించింది.
ఇదీ చదవండి: దేశంలో కరోనా తగ్గుముఖం- కొత్త కేసులు ఎన్నంటే?