ETV Bharat / bharat

విద్యార్థిపై ఒకేసారి ముగ్గురు టీచర్ల ప్రతాపం.. దెబ్బలకు తట్టుకోలేక మృతి - ఉత్తర్​ప్రదేశ్​ న్యూస్​

వాచీ దొంగిలించాడనే కారణంతో ఉపాధ్యాయులు కొట్టడం వల్ల 9వ తరగతి విద్యార్థి మృతిచెందాడు. తీవ్ర గాయాలైన విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని కన్నౌజ్​లో జరిగింది.

student died after beaten teacher
student died after beaten teacher
author img

By

Published : Jul 26, 2022, 3:45 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కన్నౌజ్​లో అమానవీయ ఘటన జరిగింది. ఉపాధ్యాయులు కొట్టడం వల్ల 9వ తరగతి విద్యార్థి మృతిచెందాడు.
ఛిబరమవు కొత్వాలి పరిధిలోని కసవ గ్రామానికి చెందిన జహంగీర్​కు 15 ఏళ్ల కుమారుడు దిల్షాన్​ ఉన్నాడు. అతడిని జులై 23న స్థానిక పాఠశాలలో 9వ తరగతిలో చేర్పించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో దిల్షాన్​ను పిలిచిన ఉపాధ్యాయులు శివకుమార్​.. గది తలుపులు మూసేశారు. అనంతరం మరో ఇద్దరు ఉపాధ్యాయులు ప్రభాకర్​, వివేక్​ వచ్చి.. తోటి విద్యార్థి వాచీ​ దొంగతనం చేశావంటూ దారుణంగా కొట్టారు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న బంధువులు.. స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఆదివారం కాన్పుర్​కు పంపించారు వైద్యులు. చికిత్స పొందుతున్న క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి బాలుడు మరణించాడు. అనంతరం బాలుడి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి గ్రామానికి తరలించారు. అయితే తమ కుమారుడు వాచీ దొంగలించాడనే కారణంతో కొట్టారని.. కానీ ఆ వాచీని మరొకరు అతడి బ్యాగులో పెట్టాడని తండ్రి ఆరోపించాడు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా కొట్టడం వల్లే మరణించాడని మృతుడి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. బాలుడు చికిత్స పొందుతూనే మరణించాడని ఎస్పీ అనుపమ్​ సింగ్ తెలిపారు. మృతికి అసలు కారణం .. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: రాజ్యసభలో గందరగోళం.. 19 మంది ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

పోలీసుల మంచి మనసు.. అనారోగ్యంతో ఉన్న కొండముచ్చుకు ఓఆర్​ఎస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.