ETV Bharat / bharat

అనారోగ్యంతో టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

Batchula Arjunudu No more: టీడీపీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో కన్నుముశారు. గుండెపోటుతో అసుపత్రిలో చేరిన అర్జునుడు ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి చంద్రబాబు, లోకేశ్​, అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు సంతాపం తెలిపారు. అర్జునుడు మరణం పార్టీకి తీరని లోటని అన్నారు.

arjunudu no more
arjunudu no more
author img

By

Published : Mar 2, 2023, 7:10 PM IST

Updated : Mar 2, 2023, 7:41 PM IST

Batchula Arjunudu No more : టీడీపీ సీనియర్​ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనవరి 28వ తేదీన ఆయనకు గుండెపోటు రావటంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి అర్జునుడు గురువారం తుదిశ్వాస విడిచారు. బచ్చుల అర్జునుడు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందినవారు. శుక్రవారం ఆయన భౌతికకాయాన్ని స్వగృహానికి తరలించనున్నారు.

మార్చి 29తో బచ్చుల అర్జునుడి ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది.అర్జునుడు మరణించటంతో రేపు అమరావతిలో జరగాల్సిన టీడీపీ సమావేశం వాయిదా పడింది. అంతేకాకుండా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ సమావేశాన్ని వాయిదా వేశారు.

బ‌చ్చుల అర్జునుడు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. బచ్చుల అర్జునుడు మరణం అత్యంత విషాదకరమన్నారు. బచ్చుల అర్జునుడి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. అర్జునుడు కుటుంబానికి తన సానుభూతి ప్రకటించారు. అర్జునుడి మృతిపట్ల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సంతాపం ప్రకటించారు. అర్జునుడి మరణవార్త తనను దిగ్భాంత్రికి గురి చేసిందని తెలిపారు. అర్జునుడు నిజాయితీకి మారుపేరని.. అజాత శత్రువని గుర్తు చేశారు. టీడీపీ బలోపేతానికి అర్జునుడు ఎన‌లేని కృషి చేశారని వెల్లడించారు.

బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన సమయంలో చంద్రబాబు అర్జునుడుని పరామర్శించారు. అర్జునుడు తనను ఎప్పుడు విజయవాడ విమానాశ్రయం వచ్చినా కలిసేవాడని చంద్రబాబు తెలిపారు. బచ్చుల అర్జునుడు కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్‌గా టీడీపీ పార్టీకీ సేవలందించారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్​​ పోటీ చేసి విజయం సాధించారు. ఆయన వైసీపీలో చేరటంతో.. టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా పని చేసిన బచ్చుల అర్జునుడును గన్నవరం నియోజవర్గానికి ఇంఛార్జ్​గా నియమించారు. ఆయనకు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీడీపీ శ్రేణులతో సత్సంబంధాలు ఉండటంతో.. అధిష్టానం ఇంఛార్జ్​గా నియామిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనైతిక విధానాలను, నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు అర్జునుడు ప్రశ్నిస్తూ వచ్చారు. పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని గతంలో ఆరోపించారు. పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధులు ఏం చేశారో తెలపాలని ప్రభుత్వాన్ని అర్జునుడు పశ్నించారు.

Last Updated : Mar 2, 2023, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.