ETV Bharat / bharat

TDP Called for AP Bandh : నేడు ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కు టీడీపీ పిలుపు.. మద్దతు ప్రకటించిన జనసేన

Chandrababu Naidu arrest
TDP Called for AP Bandh
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 8:13 PM IST

Updated : Sep 11, 2023, 6:18 AM IST

20:09 September 10

నేడు ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కు పిలుపునిచ్చిన తెలుగుదేశం

TDP Called for AP Bandh : టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా నేడు ఆంధ్రప్రదేశ్ బంద్‌కు తెలుగుదేశం పార్టీ (TDP Called for AP Bandh ) పిలుపునిచ్చింది. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ.. జగన్‌ కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా సోమవారం బంద్​కు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని అచ్చెన్నాయుడు కోరారు.

Janasena Supports AP Bandh Tomorrow : నేడు తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఏపీ బంద్‌కు.. జనసేన పార్టీ సంఘీభావం (Janasena Supports AP Bandh Tomorrow) ప్రకటించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించింది. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోందని ఆరోపించింది. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో.. వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని మండిపడింది. సోమవారం జరిగే బంద్‌లో పార్టీ శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని జనసేన పిలుపునిచ్చింది.

CPI Narayana Comments on Chandrababu Arrest : 'అమిత్ షా అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టుకు అవకాశం లేదు'

Pawan Kalyan Support Chandrababu : చంద్రబాబుకు ఎప్పుడూ తన పూర్తి మద్దతు ఉంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan Support Chandrababu) స్పష్టం చేశారు. అసెంబ్లీ నిర్ణయాన్ని తప్పుబడుతూ చంద్రబాబును జైలుకు పంపారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ఇసుక దొంగలను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. తుదిశ్వాస వరకు జగన్‌పై పోరాటం చేస్తానని పునరుద్ఘాటించారు. యుద్ధం కావాలని కోరుకుంటే అందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు. జగన్.. నువ్వు జైలుకు వెళ్తే అందరూ జైలుకు వెళ్లాలా అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.

తెలంగాణలో జగన్‌ను రాళ్లతో తరిమికొట్టారని పవన్‌ కల్యాణ్‌ గుర్తుచేశారు. రేపు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి రావచ్చని పేర్కొన్నారు. జగన్ రాష్ట్రానికి హానికరం.. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మన బాధ్యతని తెలిపారు వారాహి యాత్రపై దాడికి 2,000 మంది నేరగాళ్లను దింపారని ధ్వజమెత్తారు. కోనసీమ జిల్లాలో 50 మందిని చంపేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. వైసీపీ మూకల కుట్ర తెలిసి కేంద్ర పెద్దలు దాన్ని నిలువరించారని చెప్పారు. చట్టాలు సరిగా పనిచేస్తే బెయిల్‌పై వచ్చినవాళ్లు సీఎం కాలేరని విమర్శించారు. ఈ ప్రభుత్వం.. రాజకీయాలను మరో స్థాయికి దిగజార్చిందని పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"చంద్రబాబుకు ఎప్పుడూ నా పూర్తి మద్దతు ఉంటుంది. అసెంబ్లీ నిర్ణయాన్ని తప్పుబడుతూ చంద్రబాబును జైలుకు పంపారు. అధికారంలోకి వచ్చాక ఇసుక దొంగలను వదిలే ప్రసక్తే లేదు. తుదిశ్వాస వరకు జగన్‌పై పోరాటం చేస్తా. యుద్ధం కావాలని కోరుకుంటే అందుకు మేం సిద్ధం. జగన్.. నువ్వు జైలుకు వెళ్తే అందరూ జైలుకు వెళ్లాలా?." - పవన్‌ కల్యాణ్‌, జనసేన అధినేత

Chandrababu Marriage Day: పెళ్లిరోజు వేళ కోర్టులో చంద్రబాబు.. కక్ష సాధింపేనా..!

CPI Party Supports AP Bandh Tomorrow : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. నేడు తెలుగుదేశం పార్టీ చేపట్టిన రాష్ట్ర బంద్‌కు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నేడు విజయవాడలో జరగాల్సిన సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశాన్ని.. సెప్టెంబర్ 12 కు వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ అమలు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు హుకుం జారీ చేశారు.

Skill Development Case Updates: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఈనెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్‌

Twitter Posts on Chandrababu Naidu Arrest : ఈ అరాచకాలు.. ఎన్నాళ్లు.. ఇంకెన్నాళ్లు.. మౌనం వెనక ప్రళయం ఉంది.. గుర్తుపెట్టుకో జగన్

Last Updated : Sep 11, 2023, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.