ETV Bharat / bharat

విడాకులు అడిగిందని నడిరోడ్డుపై హత్య.. ప్రేయసిపై కోపంతో విషం తాగి ఆత్మహత్య

మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. విడాకులు అడిగిందని భార్యను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడో వ్యక్తి. మరో ఘటనలో తన ప్రేయసి సామాజిక మాధ్యమాల్లో కొంతమంది పురుషులను ఫాలో అవుతోందని ఆగ్రహించిన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

SENSATIONAL INCIDENT IN CHEMBUR
TAXI DRIVER KILLED HIS WIFE
author img

By

Published : Sep 28, 2022, 2:18 PM IST

విడాకులు అడిగిందని భార్యను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడో వ్యక్తి. ఆ మహిళ చేతులు, మెడపై కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. ఈ ఘటన ముంబయిలోని చెంబూర్​లో జరిగింది. మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

అసలేం జరిగింది:​ ఇక్బాల్​ ట్యాక్సీ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అతనికి మొదట ఓ మహిళతో వివాహం జరిగింది. అయితే పిల్లలు పుట్టలేదన్న నెపంతో ఆమెను వదిలేసి రూపాలీ అనే మహిళను మూడేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. రూపాలీ వేరే మతానికి చెందిన మహిళ కావడం వల్ల ఇక్బాల్​ కుటుంబ సభ్యులు రూపాలీని వేధించడం మొదలుపెట్టారు. ఆమెను ముస్లిం సంప్రదాయాలను పాటించమని ఇక్బాల్​ కుటుంబసభ్యులు ఒత్తిడి చేశారు. బుర్ఖా వేసుకోమని అడగగా రూపాలీ అందుకు నిరాకరించింది. దీంతో తరచూ ఇంట్లో వాగ్వాదం జరుగుతుండేది. ఒత్తిడి తట్టుకోలేని రూపాలీ తన కొడుకుని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. దాదార్​లోని ఓ హాస్టల్​లో తన స్నేహితురాలితో నివసిస్తోంది. భార్య భర్తలిద్దరూ ఫోన్​లో మాట్లాడుకుంటున్నప్పటికి ముస్లిం సంప్రదాయాలు పాటించే విషయమై ఇద్దరికి గొడవలు జరిగేవి. బాబు కస్టడీ విషయమై మాట్లాడాలని సోమవారం రూపాలీని బయటకు రమ్మని పిలిచాడు. బయటకి వచ్చిన రూపాలీని అతి దారుణంగా పొడిచాడు. గాయాలు తీవ్రంగా కావడం వల్ల రుపాలీ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడి నుంచి పరారైన ఇక్బాల్​కు కొన్ని గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మైనర్​ బాలుడిపై లైంగిక వేధింపులు..
ఉత్తర్​ప్రదేశ్​లోని టిట్రాన్ ప్రాంతంలో ఓ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. బాలుడి స్నేహితుల సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది: టిట్రాన్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు కొంత మంది స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఫాజిల్​, బషర్​ అనే ఇద్దరు వ్యక్తులు ఆ బాలుడ్ని మభ్యపెట్టి చెరుకు తోటలోకి తీసుకెళ్లారు. ఎంత సేపటికి బాలుడు రాకపోవడాన్ని గమనించిన స్నేహితులు అతని ఆచూకీ కోసం గాలించారు. తీరా చెరుకు తోటలో గాలించగా అక్కడ బాలుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. బాలుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఫాజిల్, బషర్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ప్రేయసిపై కోపంతో విషం తాగి ఆత్మహత్య : తన ప్రేయసి సామాజిక మాధ్యమాల్లో కొంతమంది పురుషులను ఫాలో అవుతోందని ఆగ్రహించిన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో జరిగింది. విషం తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

పోలీసుల కథనం ప్రకారం.. నాగ్​పుర్​లోని రామ్​నగర్​కు చెందిన రోహన్​ సింగ్​ కపూర్​ ఓ యువతిని ప్రేమించాడు. ఆమె ఇన్​స్టాలో పురుషులను ఫాలో అవుతుందన్న విషయంపై ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం జరిగింది. తన ప్రేయసి తన మాట వినడంలేదని మనస్తపానికి గురైన రోహన్​.. సోమవారం రామ్​దాస్​పేథ్​ ప్రాంతంలోని దుర్గా పూజ పందిరి వద్ద విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న రోహన్​ సోదరుడు అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ రోహన్​ మంగళవారం మృతి చెందాడు. యువతితో గొడవలే కాకుండా అతడికి అప్పుల బాధలు కూడా ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది.

ఆరెళ్ల పసిపిల్లపై దారుణానికి పాల్పడ్డ వృద్ధుడు..
పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ అరవై ఏళ్ల కామాంధుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని షామ్​లీ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఆ వృద్ధుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది: షామ్​లీ జిల్లాకు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధుడు తన పక్కింటిలో ఉన్న ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్​ ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్లాడు. చిన్న పిల్ల అని జాలి లేకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు విన్న కుటుంబసభ్యులు వెంటనే వృద్ధుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. అప్పటికే అతను పరారయ్యాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధుడి ఆచూకి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: లగ్జరీ కారులో రేషన్ షాప్​కు.. 'నిరుపేద' ఆప్ నేత వీడియో వైరల్

దూసుకొచ్చిన ఏనుగులు.. చెట్టుపైకి ఎక్కిన రైతు.. గంటన్నర అక్కడే.. చివరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.