ETV Bharat / bharat

భూతవైద్యం పేరుతో అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యం - exorcism latest news gujarat

భూతవైద్యం పేరుతో అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ తాంత్రికుడు. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది. బాధితురాళ్ల తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో నిందుతుడిని, అతడికి సహకరించిన వారిని అరెస్టు చేశారు పోలీసులు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Guj: Tantrik, two others held for raping two sisters
భూతవైద్యం పేరుతో అక్కాచెల్లెళ్లపై అఘయిత్యం
author img

By

Published : Nov 7, 2020, 7:44 PM IST

భూతవైద్యం పేరుతో ఓ తాంత్రికుడు.. తన సిబ్బందితో కలిసి గుజరాత్​ నవసరి జిల్లాకు చెందిన అక్కాచెళ్లెల్లపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల్లో ఒక మైనర్ ​కూడా ఉన్నారు. బాధితురాళ్లు ఇద్దరూ గర్భవతులని తెలుసుకున్న తండ్రి స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. వెంటనే నిందితులను అరెస్టు చేసి ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ జరిగింది ..

బాధితురాళ్ల తండ్రికి భూతవైద్యుడు విష్ణునాయక్​ అంతకు ముందే పరిచయం. ఇద్దరు కూతుళ్లకు దెయ్యం పట్టిందని భూతవైద్యం చేయాలని నమ్మించాడు తాంత్రికుడు. దీనికోసం రూ.50వేలు ఖర్చు అవుతుందని బాలికల తండ్రికి చెప్పాడు. ఈ నేపథ్యంలో భూతవైద్యుడి ఇంటికి పలుమర్లు వచ్చిన అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. అంతేకాక తాంత్రికుడి దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు సైతం అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.