తమిళనాడులోని తిరువళ్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నవ దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు.
ప్రయాణం విషాదం..
రాణిపేట జిల్లా అరక్కోణంకు చెందిన మనోజ్‌కుమార్‌కు (31), డాక్టర్ కార్తీకతో(30) అక్టోబర్ 28న వివాహం జరిగింది. నవ దంపతులైన వీరు చెన్నై నుంచి మనోజ్‌కుమార్ స్వస్థలానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో అనుకోని విధంగా వీరి కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీనితో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటన అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద తీవ్రతకు నవదంపతుల కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిన దృశ్యాలు చూపరులను కలసివేశాయి.
ఇవీ చదవండి: