తమిళనాడులో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటికే తీరప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పాఠశాలలు మూసివేసింది. అయితే రానున్న మూడు గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13674224_5.jpg)
![heavy rainfall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13674224_ss.jpg)
![heavy rainfall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13674224_ssg.jpg)
నీలగిరి, సాలెమ్, ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూర్, వెళ్లూర్, కడలూరు ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.
కర్ణాటకలో సూళ్లకు సెలవు..
భారీ వర్షాల కారణంగా.. కర్ణాటకలోని అన్ని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు 1నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠశాలలు మూసివేయాలని ఆదేశించింది. ఎప్పటికప్పుడు వర్షప్రభావాన్ని సమీక్షించాలని స్థానిక అధికారులకు సూచనలు చేసింది.
![heavy rainfall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13674224_1.png)
![heavy rainfall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13674224_2.jpg)
![heavy rainfall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13674224_ssg.jpg)
వర్షాల కారణంగా బెంగళూరు, ఇతర ప్రాంతాలు జలమలం అయ్యాయి. కర్ణాటకలోని చిక్కమగళూర, హసన్, కొడగు, శివమొగ్గ, తమకురు, కోలార్, మండ్యా, రామనగర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
పుదుచ్చేరిలోనూ..
![heavy rainfall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13674224_bd.jpg)
![heavy rainfall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13674224_ss.jpg)
భారీ వర్షాల దృష్ట్యా పుదుచ్చేరిలోని పాఠశాలలకు, కాలేజీలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నట్లు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: తమిళనాడులో భారీ వర్షాలు- తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్