ETV Bharat / bharat

Acid attack: బస్టాండ్​లో భార్యపై యాసిడ్ దాడి - సేలం వార్తలు

భార్యపై యాసిడ్​ పోశాడు (Acid attack) ఓ కిరాతక భర్త. తల్లితో కలిసి బస్టాండ్​లో ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

acid attack
భార్యపై యాసిడ్​ దాడి
author img

By

Published : Aug 31, 2021, 8:33 PM IST

బస్టాండ్​లో ఉన్న భార్యపై యాసిడ్​ దాడి (Acid attack) చేశాడు ఓ కిరాతకుడు. తమిళనాడులోని సేలంలో ఈ ఘటన జరిగింది. చికిత్స పొందుతూ బాధితురాలు మంగళవారం మరణించింది.

ఇదీ జరిగింది..

యేసుదాస్​(53), రేవతిలకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులున్నారు. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో పుట్టింటికి వెళ్లిపోయింది రేవతి.

ఈ నేపథ్యంలో ఆగస్టు 30న తల్లి అరయితో కలిసి సేలం మహిళా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది రేవతి. అనంతరం తిరిగి ఇంటికి వచ్చేందుకు.. ఓ పాత బస్టాండ్​ వద్ద నిలబడింది.

ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న యేసుదాస్​.. రేవతి మొహంపై ఒక్కసారిగా యాసిడ్​ పోసి పారిపోయాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ మొహం మొత్తం కాలిపోయింది.

acid attack
యేసుదాస్

స్థానికులు 108కి కాల్​ చేసి రేవతిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.

acid attack
రేవతి

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యేసుదాస్​ను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: భార్య జననాంగాన్ని కుట్టేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.