డీఎంకే అధినేత స్టాలిన్.. తన జన్మదినం సందర్భంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి స్మారకానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ తమిళనాడు సీఎం సీఎన్ అన్నాదురైకూ పుష్పాంజలి ఘటించారు.
డీఎంకే అధినేత స్టాలిన్ సోమవారం 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, కమల్ హాసన్.. తదితర రాజకీయ ప్రముఖలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో డీఎంకే ఎన్నికల ప్రచార పాటను ఆ పార్టీ సీనియర్ నేత దురైమురుగన్ విడుదల చేశారు.
'డీఎంకే అధినేత స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. స్టాలిన్‌తో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఫోన్లో సంభాషించినట్లు డీఎంకే పార్టీ కార్యాలయం ట్వీట్ చేసింది. వీరితో పాటు భాజపా నేత కుష్బూ సుందర్, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి.. తదితరులు స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కరుణానిధి స్మారకానికి నివాళులు అర్పించిన తర్వాత.. దివ్యాంగులతో కలిసి పుట్టిన రోజు వేడుకను చేసుకున్నారు స్టాలిన్.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
- స్థానాలు:- 234
- పోలింగ్ తేదీ:- ఏప్రిల్ 6
- ఫలితాలు:- మే 2
ఇదీ చదవండి : తమిళ రాజకీయాల్లో 'వారు' మాయం- డీఎంకేకే లాభం!