కన్న కొడుకే ఓ వ్యక్తి పాలిట కాలయముడయ్యాడు. మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వలేదని తండ్రిని హత్య(Father Killed By Son) చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు కడలూరు జిల్లాలో(Tamil Nadu Cuddalore News) జరిగింది.
కడలూరు జిల్లా అన్నాయ్కూపమ్లో ఎంబీఏ పూర్తి చేసిన కార్తీక్, తన తండ్రి సబ్రమణ్యంతో కలిసి నివసిస్తున్నాడు. సోమవారం.. మద్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు కావాలని కార్తీక్ తన తండ్రిని అడిగాడు. అయితే.. డబ్బులు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు. కోపోద్రిక్తుడైన కార్తీక్.. సుబ్రమణ్యాన్ని ఇనుప రాడ్డుతో పలుమార్లు బాదాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని(Father Killed By Son) పోలీసులు తెలిపారు.
వారి ద్వారా పోలీసులకు..
తండ్రి మృతదేహాన్ని తరలించేందుకు ఫ్రీజర్ బాక్సును సరఫరా చేసే ఏజెన్సీకి కార్తీక్ ఫోన్ చేశాడు. వారు ఇంటికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించగా.. అది హత్యగా గుర్తించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కార్తీక్ను పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడి గదిలో ఖాళీ మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు, ఖాళీ అయిన ఆహార పొట్లాలను గుర్తించారు. చాలా వారాలుగా ఆ గదిని శుభ్రం చేయలేదని చెప్పారు.
ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కార్తీక్ను సైకో అనాలసిస్ పరీక్ష చేసేందుకు పోలీసులు తరలించారు.
భర్తను చంపిన భార్య...
కేరళ తిరువనంతపురంలో(Kerala Thiruvananthapuram) దారుణం జరిగింది. మంచంపట్టిన భర్తతో వేగలేని భార్య.. అతడ్ని గొంతుకోసి హత్య(Wife Kills Husband) చేసింది.
అసలేం జరిగింది?
సుమతి(67), గోపీ(72) భార్యాభర్తలు. శరీరంలో ఒకవైపు పక్షవాతం కారణంగా గత పదేళ్లుగా.. గోపీ మంచానికే పరిమితమయ్యాడు. వారిద్దరూ తమ కుమార్తెతో కలిసి కంజాపురంలో గత ఆర్నెళ్లుగా ఉంటున్నారు. అయితే.. తమ కుమారుడు సునీల్ దాస్ కొత్త ఇల్లు గృహ ప్రవేశం ఉన్నందున నెయ్యట్టింకారాకు వారు వచ్చారు. అక్కడే నిర్మాణంలో ఉన్న ఓ గదిలో ఉన్నారు.
మంగళవారం ఉదయం సునీల్ దాస్.. తన తండ్రికి అల్పాహారం అందించేందుకు వారి గదిలోకి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం కనిపించింది. ఆ పక్కనే అపస్మారక స్థితిలో అతని తల్లి పడి ఉండడం కనిపించింది. ఈ మేరకు పోలీసులు తెలిపారు.
సుమతిని చికిత్స కోసం తిరువనంతపురం వైద్య కళాశాలకు తరలించారు. మారాయముట్టం పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. సుమతిని అరెస్టు చేశారు.
ఇవీ చూడండి: