ETV Bharat / bharat

కిలాడీ లవర్స్​.. దారినపోయే వారిని మాటలతో మైమరిపించి అంతలోనే - తమిళనాడు న్యూస్​

Chain Snatching Lovers: వారిద్దరూ ప్రేమికులు.. చిరునామా చెప్పండంటూ మాటలు కలుపుతారు.. ప్రియురాలు బైక్​ నడుపుతుండగా.. ప్రియుడు వెనుక కూర్చుని గొలుసులను చోరీ చేస్తుంటాడు. గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని తమిళనాడు కోయంబత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

Chain Snatching Lovers
Chain Snatching Lovers
author img

By

Published : May 3, 2022, 8:40 PM IST

Couple Chain Snatching: సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ప్రేమికులను తమిళనాడు కోయంబత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలు బైక్​ నడుపుతూ చిరునామా అడుగుతుండగా.. ప్రియుడు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ప్రసాద్​(20), తేజస్విని(20) గా గుర్తించారు.

ఇదీ జరిగింది: కోయంబత్తూరులోని తొండముత్తూర్​ ప్రాంతానికి చెందిన కాలియమ్మాళ్​ అనే మహిళ ఏప్రిల్​ 28న పొలానికి సమీపంలో మేకను మేపుతోంది. స్కూటర్​పై వచ్చిన ప్రేమికులు.. ఆ మహిళను చిరునామా అడిగారు. ఆమె వారికి అడ్రస్​ చెప్తుండగా.. వెనుక కూర్చున్న ప్రసాద్​ హఠాత్తుగా మహిళ మెడలోని గొలుసు లాగేశాడు. అనంతరం వారిద్దరూ అక్కడినుంచి పారిపోయారు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీలను పరిశీలించి నిందితులను అరెస్ట్​ చేశారు.

Chain Snatching Lovers
నిందితులు ప్రసాద్​, తేజస్విని

నిందితులు పేరూర్​ పచ్చపాళ్యంలోని ఓ ప్రైవేట్​ కళాశాలలో బీటెక్​ మూడో సంవత్సరం చదువుతున్నారని.. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని పోలీసులు చెప్పారు. ఆన్​లైన్​ బెట్టింగ్​తో ప్రసాద్​ పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. అప్పులు తీర్చేందుకే నిందితులు ఈ నేరాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అంతకుముందు ప్రసాద్​ ఇంట్లోనే 30 సవర్ల బంగారం పోయిందని.. విచారణలో ప్రసాద్​ దొంగలించాడని తేలడం వల్ల అతడి తండ్రి కేసును ఉపసంహరించుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరిని జ్యుడిషియల్​ కస్టడీకి తరలించారు.

ఇదీ చదవండి: మద్యం కోసం రైలును ఆపేసిన డ్రైవర్​.. మార్కెట్లో హంగామా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.