Tamil nadu chennai rains: తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా.. విద్యుదాఘాతానికి గురై.. చెన్నైలో గురువారం ముగ్గురు వ్యక్తులు మరణించారు.
గురువారం మధ్యాహ్నం నుంచి చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. రహదారులన్ని జలమయమయ్యాయి. వరద కారణంగా.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి.
ఒట్టేరి ప్రాంతంలో విద్యుదాఘాతానికి గురై తమిళరసి అనే 70 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. పులియన్టొప్పు ప్రాంతంలో నివసించే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మీనా(45) సహా.. మైలాపుర్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ అనే 13 ఏళ్ల బాలుడు కూడా విద్యుదాఘంతో మృతి చెందాడు. గేట్ తెరిచే సమయంలో షాక్ తగలగా లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయాడు.
రహదారులపై ట్రాఫిక్ జాం నేపథ్యంలో... చెన్నై మెట్రో సంస్థ తమ సేవలను రాత్రి 12 గంటలవరకు కొనసాగుతాయని ప్రకటించింది. ప్రయాణికులంతా క్షేమంగా తమ ఇళ్లకు వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
ఐఎండీ ఆరెంజ్ అలర్ట్..
భారీ వర్షాల నేపథ్యంలో.... చెన్నై, కాంచీపురం, చెంగళ్పట్టు, తిరువల్లూర్ ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మరికొన్నిగంటలపాటు భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది.
ఇదీ చూడండి: CCTV Video: పేలిన లారీ టైర్.. ఒక్కసారిగా ఎగిరిపడి మెకానిక్ మృతి