ETV Bharat / bharat

కేరళ సీఎంగా ఈ నెల 20న 'పినరయి' ప్రమాణం

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలుపొందిన పినరయి విజయన్​.. ఈ నెల 20న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 21 మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేయనున్నారు. కొవిడ్​ నిబంధనల నడుమ నిరాడంబరంగానే ఈ కార్యక్రమం జరగనుందని సీఎం వెల్లడించారు.

Pinarayi Vijayan, Kerala CM
పినరయి విజయన్, కేరళ సీఎం
author img

By

Published : May 17, 2021, 9:43 PM IST

కేరళలో వరుసగా రెండోసారి విజయం సాధించిన పినరయి విజయన్​.. ఈ నెల 20న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్​ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుండగా.. సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది.

ఆ రాష్ట్ర గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ఖాన్​ విజయన్​తో ప్రమాణం చేయించనున్నారు. సీఎంతో పాటు మరో 21 మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్​ మార్గదర్శకాలను అనుసరించి నిరాడంబరంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

మొత్తం 50వేల మంది సామర్థ్యం కలిగిన సెంట్రల్​ స్టేడియంలో కేవలం 500 మంది అతిథుల సమక్షంలో ప్రమాణస్వీకారోత్సవం జరగనుందని సీఎం తెలిపారు. కొత్తగా ఎన్నికైన 140 ఎమ్మెల్యేలు, రాష్ట్రంలోని 29 మంది పార్లమెంట్​ సభ్యులు, మీడియా ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వ్యక్తులు 48 గంటల ముందు టెస్టింగ్​ చేయించుకున్న కొవిడ్​-19 నెగెటివ్​ రిపోర్ట్​ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో వామపక్ష కూటమి 99 సీట్లను గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. యూడీఎఫ్​​ కేవలం 41 స్థానాలకే పరిమితమైంది.

ఇదీ చదవండి: నారదా కుంభకోణం కేసులో ఆ నలుగురికీ బెయిల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.