ETV Bharat / bharat

'ఆయనతో సంబంధంపై పుస్తకం రాసేందుకు సిద్ధం'

Swapna Suresh Shivashankar: కేరళ బంగారం కేసు నిందితురాలు స్వప్న సురేశ్​ తనను మోసం చేసిందంటూ మాజీ ప్రధాన కార్యదర్శి శివశంకర్​ ఇటీవల తను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను స్వప్న తోసిపుచ్చింది. శివశంకర్​ను తాను మోసం చేయలేదని.. ఆయన ఈ ఇలాంటి ఆరోపణలు చేస్తారని అనుకోలేదని పేర్కొంది.

swapna suresh
స్వప్న సురేశ్
author img

By

Published : Feb 6, 2022, 7:32 AM IST

Swapna Suresh Shivashankar: కేరళలో దాదాపు రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన బంగారం స్మగ్లింగ్​ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేశ్​కు అప్పటి ప్రధాన కార్యదర్శి ఎం శివశంకర్​ సహకరించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే స్వప్న తనను మోసం చేసిందని తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు శివశంకర్​. తాజాగా ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన స్వప్న.. శివశంకర్​ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. ఆయనతో తనకున్న అనుబంధం గురించి పుస్తకం రాసేందుకు కూడా సిద్ధమని పేర్కొంది.

స్వప్న లంచం ద్వారా సంపాదించిన ఐఫోన్​ను తనకు బహుకరించి మోసం చేసిందంటూ శివశంకర్​ తన పుస్తకంలో పేర్కొన్నారు.

"ఆయన నా శత్రువు కాదు. నేను ఆయనను అలా చూడలేను. కానీ నా గురించి ఆయన పుస్తకంలో ఏమైనా చెడుగా ఉంటే కచ్చితంగా స్పందిస్తాను. మేము ఒకరికొరం మా కుటుంబ సమస్యలను పంచుకునే వాళ్లం. అదే మా ఇద్దరినీ దగ్గరకు చేర్చింది. కొన్నేళ్లుగా తన భార్యతో బాంధవ్యానికి దూరంగా ఉన్నట్లు శివశంకర్​ నాతో చెబుతుండేవారు. నా గురించి ఆయన ఇలా రాస్తారని నేను అనుకోలేదు."

-స్వప్నా సురేశ్​, బంగారం కేసు నిందితురాలు

ఆయనే సిఫార్సు చేశారు..

శివశంకర్​ తాను రాసిన 'అశ్వద్థమవు-వేరుమ్​ ఓరు అనా' పుస్తకంలో నిందితురాలు స్వప్న గురించి ప్రస్తావించిన మరో విషయం.. ఆమెకు ఉద్యోగం ఇప్పించడం. 'స్పేస్​పార్క్​'లో స్వప్నకు ఉద్యోగానికి తాను సిఫార్సు చేయలేదన్నారు. దీనిపై స్పందించిన స్వప్న.. శివశంకరే తన ప్రతిభ, సత్తా గుర్తించి ఆ ఉద్యోగానికి సిఫార్సు చేసినట్లు చెప్పుకొచ్చింది.

శివశంకర్​​ సార్​దే ప్రధాన పాత్ర..

ఓ మహిళగా తన జీవితం నాశమైందని.. అందులో శివశంకర్​ సార్​ ప్రధాన పాత్ర పోషించారంటూ స్వప్న ఆరోపించింది. "ప్రపంచమంతా నేను చెడ్డదానిని అంటూ చెబుతోంది. నాకు మా అమ్మ మద్దతుగా నిలుస్తోంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే సమాజం నాకు వ్యతిరేకంగా నిలుస్తోంది. ప్రజలు నన్ను నమ్మట్లేదు. ఇలాంటి పుస్తకాలు నాపైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. నన్ను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? శివశంకర్​ సార్​కు అన్ని తెలుసు" అని స్వప్న సురేశ్​ పేర్కొంది.

గత మూడేళ్లుగా శివశంకర్​ తన కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారని.. అలాంటి వ్యక్తిని తాను ఎందుకు మోసం చేస్తానంటూ స్వప్న ప్రశ్నించింది. తాను ఆ పుస్తకం చదవలేదని.. కాబట్టీ అందుకు సంబంధించిన వివరాలు తనకు తెలియవని వెల్లడించింది.

కేసు విచారణలో ముఖ్యమంత్రి పినరయ్​ విజయన్​కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇవ్వాలని అధికారులు తనను ఏమీ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేసింది. బంగారం స్మగ్లింగ్​ కేసులో జైలులో ఉన్న ఆమె.. ఇటీవల బెయిల్​పై విడుదలైంది.

ఇదీ చూడండి : పసికందుపై కేర్​టేకర్​ క్రూరత్వం.. చిన్నారి మెదడులోని నరాలు చిట్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.