ETV Bharat / bharat

'ఆ ఇద్దరు మాజీ మంత్రులు నన్ను లైంగికంగా వేధించారు' - కేరళ లేటెస్ట్ న్యూస్

కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్.. సీపీఎం నాయకులపై లైంగిక ఆరోపణలు చేశారు. తనను మాజీ మంత్రి సురేంద్రన్​, మాజీ స్పీకర్ లైంగికంగా వేధించారని ఆరోపించింది.

gold smuggling scandal kerala
బంగారం స్మగ్లింగ్ కేసు
author img

By

Published : Oct 22, 2022, 3:47 PM IST

బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్.. సీపీఎం నాయకులపై తీవ్ర లైంగిక ఆరోపణలు చేసింది. రాష్ట్ర మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్​, మాజీ స్పీకర్ శ్రీధర్​కృష్ణన్ తనకు​ అసభ్యకర మెసేజ్​లు పెట్టారని ఆరోపించింది. మాజీ మంత్రి థామస్ ఐజాక్ కూడా తనను హిల్ స్టేషన్​కు పిలిచారని చెప్పింది. శుక్రవారం ఓ​ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. పలు విషయాలపై మాట్లాడారు. స్వప్నా సురేశ్.. సీపీఐ నాయకులపై ఆరోపణలు చేసి 12 గంటలు గడుస్తున్నా ఆ పార్టీ నాయకులెవరూ ఇంతవరకు స్పందించలేదు.

గత కొంత కాలంగా కేరళ సీఎం పినరయి విజయన్​, ఆయన కుటుంబ సభ్యులపై స్వప్న తీవ్ర ఆరోపణలు చేస్తోంది. 30కిలోల బంగారం స్మగ్లింగ్​ కేసులో స్వప్నా సురేశ్‌తోపాటు సందీప్ నాయర్​ను జాతీయ దర్యాప్తు సంస్థ 2020 జులైలో కస్టడీలోకి తీసుకుంది. 16 నెలల జైలు జీవితం తర్వాత గత ఏడాది నవంబర్​లో స్వప్న సురేశ్​ విడుదలయ్యారు.

ఇవీ చదవండి: అరుణాచల్ హెలికాప్టర్ క్రాష్​పై విచారణ.. ఘటనకు ముందు ఏం జరిగిందంటే?

'రూ.50కోట్లు ఇస్తే ఆ రాష్ట్రంలో వీసీ పదవి'.. గవర్నర్ సంచలన ఆరోపణలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.