ETV Bharat / bharat

ఆశీర్వాదం పేరుతో స్వామీజీ లైంగిక వేధింపులు, బాలికలను గదిలోకి పిలిచి - స్వామీజీపై పోక్సో చట్టం కింది కేసు నమోదు

కర్ణటకకు చెందిన ఓ స్వామీజీపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ మఠం నిర్వహిస్తున్న హాస్టల్​లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఈ ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

sexual harassment
Students accused Swamiji of Karnataka Prestigious matha of sexually harassment
author img

By

Published : Aug 27, 2022, 5:01 PM IST

sexual harassment: కర్ణాటకకు చెందిన ఓ మఠంలోని స్వామీజీ తమను వేధిస్తున్నాడని కొంత మంది విద్యార్థినులు ఆరోపించారు. మైసూరులోని ఒడనడి సేవా ట్రస్ట్​ ఆఫ్​ విమెన్​ కంఫర్ట్, ​చిల్డ్రన్​ రెసిడెన్సియల్​ సెంటర్​లో గురువారం బాధితులు ఫిర్యాదు చేశారు.
విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన స్వామీజీ.. ఓ మఠం నిర్వహిస్తున్న హాస్టల్​లో చదువుకుంటున్న వారిని లైంగికంగా వేధించాడు. ప్రతి వారం స్వామీజీ విద్యార్థులను తన గదికి పిలిచి లైంగికంగా వేధించేవాడు. ప్రశ్నించినందుకు వార్డెన్​, ఇతర సిబ్బంది కూడా వారిని వేధించేవారు.

"ఈ మఠం మాకు ఉచితంగా హాస్టల్ వసతి కల్పిస్తోంది. అయితే, మమ్మల్ని వారానికి ఒకసారి స్వామీజీ తన గదికి పిలిచేవాడు. ఆశీర్వాదాల పేరుతో మమ్మల్ని లైంగికంగా వేధించేవాడు. దీనిపై మేము ప్రశ్నించినందుకు, వార్డెన్​ ఇతర పనివాళ్లు కూడా మమ్మల్ని వేధింపులకు గురిచేశారు."
-బాధిత స్టూడెంట్స్

ప్రశ్నించిన బాధితులను హాస్టల్​ సిబ్బంది బయటకు గెంటేశారు. దీంతో స్టూడెంట్స్ తమ ఇంటికి వెళ్లకుండా బెంగుళూరులోని బంధువుల వద్దకు వెళ్లారు. అయితే వాళ్లు వెళ్లే సమయంలో ఆటో డ్రైవర్​కు జరిగిన విషయం చెప్పారు. అనంతరం ఆటో డ్రైవర్​ వారిని కాటన్​ పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లాడు. పోలీసులు స్టూడెంట్స్​ను ఇంటికి పంపించారు. విషయం తెలుసుకున్న బాధితుల తల్లిదండ్రులు, ఓ లోకల్​​ ప్రజా ప్రతినిధి వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం ఆ ప్రజా ప్రతినిధి ఒడనడి ఎన్​జీఓ వద్దకు వారిని పంపించారు.

అయితే ఈ ఘటనపై ఒడనడి సేవా సంస్థాన్ డైరక్టర్​ని వివరణ కోరగా, వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఇది చాలా సున్నితమైన అంశమని, మఠం, స్వామీజీకి సం​బంధించిన విషయం కనుక వివరాలు వెల్లడించడం కుదరదని చెప్పారు. అయితే, ఈ కేసు పోక్సో చట్టం కిందకు వస్తుందని పేర్కొన్నారు. బాధితులు తమ వద్దకు వచ్చిన వెంటనే వివరాలు తెలుసుకుని, చైల్డ్​ వెల్ఫేర్​ కమిటీ వద్దకు పంపించామని తెలిపారు

స్వామీజీపై విద్యార్థినులు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల గురించి మైసూరు డీఎస్​పీ చేతన్​కు సమాచారం అందించినట్లు అదే సంస్థాన్​కు చెందిన మరో డైరక్టర్​ పరసురామ తెలిపారు. జిల్లా చైల్డ్​ ప్రొటెక్షన్​ యూనిట్​ అధికారి చంద్రకుమార్​ ఐదుగురు నిందితులపై పోక్సో చట్టం కింద ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు.

ఇవీ చూడండి: అంతా చూస్తుండగానే కూలిన ఇల్లు, 50 అడుగుల మేర గుంత

పొట్టలో 44 డ్రగ్​ క్యాప్సుల్స్​, కడుపునొప్పితో ఎయిర్​పోర్ట్​లో అడ్డంగా చిక్కి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.