ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుంద్రాఘాట్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే.. భార్యపై యాసిడ్ దాడికి (Acid Attack) పాల్పడ్డాడు. పక్కన కన్న బిడ్డలు ఉన్నారనే.. కనికరం కూడా లేకుండా యాసిడ్ పోశాడు. వారి ఆర్తనాదాలను విని తరించి.. రాక్షసానందం పొందాడు. అత్యంత హృదయ విధారకరమైన ఈ ఘటనకు వివాహేతర సంబంధం (extramarital affairs) ఉందనే అనుమానమే కారణమని పోలీసుల విచారణలో తేలింది.
ఇదీ జరిగింది..
కుంద్రాఘాట్లో ఉండే అజయ్ సాహిని అనే వ్యక్తి.. తన భార్యకు వివాహేతర సంబంధం (extramarital affairs) ఉందనే కారణంతో ఆమెపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో పక్కన ఉన్న ఇద్దరు కుమార్తెలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. భార్య, పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో కుమార్తె ప్రథమ చికిత్స అనంతరం కోలుకుని డిశ్ఛార్జ్ అయినట్లు పేర్కొన్నారు.
నిందితుడు అజయ్ సాహినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యానికి బానిసైన అజయ్ తరుచూ భార్యను అనుమానించే వాడని స్థానికులు తెలిపారు. దీనిపై రెండురోజులుగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 34 ఏళ్ల మహిళపై అత్యాచారం.. ఆపై రాడ్‌తో..