ETV Bharat / bharat

లఖింపుర్‌ ఖేరి హింసాకాండపై నేడు 'సుప్రీం'లో విచారణ - లఖింపుర్‌ ఖేరీ న్యూస్ టుడే

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. అక్టోబర్ 3 నాటి ఈ ఉద్రిక్తతల్లో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

Lakhimpur
లఖింపుర్‌
author img

By

Published : Oct 20, 2021, 4:57 AM IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో ఈ నెల 3వ తేదీని చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారణ జరపనుంది. ఈ ఉదంతంపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకుమార్‌ త్రిపాఠి, సీఎస్‌ పాండా అనే న్యాయవాదులు సీజేఐకి లేఖలు రాశారు. వీరి అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ నెల 8వ తేదీని విచారణ జరిపింది.

ఆ సందర్భంగా లఖింపుర్‌ హింసకు కారణమైన నిందితుల పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. 'దయచేసి విచారణకు హాజరుకండి' అంటూ నిందితుడికి సీఆర్‌పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మండిపడింది. మిగతా కేసుల్లో నిందితుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? అని నిలదీసింది. యూపీ సర్కారు నుంచి మాటలే తప్ప చర్యలు లేవని దుయ్యబట్టింది.

అనంతరం తదుపరి విచారణను అక్టోబరు 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఘటనపై మరో ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలా లేదా అన్నదానిపై నేటి విచారణలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.