Supreme Court On Pregnancy Termination : 26 వారాల గర్భాన్ని ఓ వివాహిత తొలగించుకునేందుకు ఇచ్చిన అనుమతిని రీకాల్ చేయాలంటా కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పును వెలువరించింది. అబార్షన్‌కు అనుమతించడాన్ని ఒకరు విముఖత వ్యక్తం చేయగా.. మరొకరు సదరు వివాహిత నిర్ణయాన్ని గౌరవించాలంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి సిఫార్చు చేయాలని సూచించారు.
తన గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ ఇద్దరు పిల్లలున్న ఓ వివాహిత ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాను కుంగుబాటుతో బాధపడుతున్నానని, మూడో చిన్నారిని పెంచేందుకు ఆర్థికంగా, మానసికంగా సిద్ధంగా లేనని పేర్కొన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. ఎయిమ్స్ వైద్యుల నివేదిక మేరకు ఆ వివాహిత గర్భ విచ్ఛిత్తికి అక్టోబర్ 9న అనుమతిచ్చింది.
-
Supreme Court gives split order on a married woman's plea seeking termination of 26-week-old pregnancy. Justice Hima Kohli says her judicial conscience does not allow her to permit termination. Expressing disagreement, Justice BV Nagarathna says the woman's decision must be… pic.twitter.com/y1aLvG3Fck
— ANI (@ANI) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Supreme Court gives split order on a married woman's plea seeking termination of 26-week-old pregnancy. Justice Hima Kohli says her judicial conscience does not allow her to permit termination. Expressing disagreement, Justice BV Nagarathna says the woman's decision must be… pic.twitter.com/y1aLvG3Fck
— ANI (@ANI) October 11, 2023Supreme Court gives split order on a married woman's plea seeking termination of 26-week-old pregnancy. Justice Hima Kohli says her judicial conscience does not allow her to permit termination. Expressing disagreement, Justice BV Nagarathna says the woman's decision must be… pic.twitter.com/y1aLvG3Fck
— ANI (@ANI) October 11, 2023
అప్పటికే గర్భిణీకి 25 వారాలు దాటడం వల్ల కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. ఈ క్రమంలో వివాహితను పరిశీలించిన వైద్య బృందం.. పిండం బతికి ఉండే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయంటూ తాజా నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ఆశ్రయించగా.. గర్భవిచ్ఛిత్తిని తాత్కాలికంగా వాయిదా వేయాలని అక్టోబర్ 10న ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. తాజాగా ఈ కేసును జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీం ధర్మాసనానికి సిఫార్సు చేయగా.. బుధవారం విచారణ చేపట్టింది.
'కచ్చితంగా అప్పుడెందుకు చెప్పలేకపోయారు?'
Supreme Court Latest News Today : ఈ సందర్భంగా గర్భ విచ్ఛిత్తి వల్ల మహిళకు ఎటువంటి సమస్య ఉండదని వైద్యులు తొలుత ఇచ్చిన నివేదికను సుప్రీం ధర్మాసనం ప్రస్తావించింది. వైద్యులు ఇచ్చిన తాజా నివేదిక పట్ల సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. గర్భస్థ శిశువు బతికి ఉండే అవకాశాల గురించి ఇంత కచ్చితంగా అప్పుడెందుకు చెప్పలేకపోయారు? అని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీని ప్రశ్నించింది.
'గుండె చప్పుడును ఆపాలని ఏ కోర్టు చెబుతుంది?'
"జీవం ఉన్న గర్భస్థ శిశువు గుండె చప్పుడును ఆపాలని ఏ కోర్టు చెబుతుంది? అలా ఏ కోర్టు చేస్తుంది? నా విషయానికొస్తే.. నేనలా చేయను" అని జస్టిస్ హిమా కోహ్లీ అభిప్రాయపడ్డారు. అనంతరం సదరు మహిళ, ఆమె భర్తతో వర్చువల్‌గా మాట్లాడి.. తాజా నివేదికలోని అంశాలు వివరించారు. తదుపరి తుది నిర్ణయాన్ని చెప్పాలని ఆ మహిళ తరఫున పిటిషనర్‌కు సూచించారు. అయినప్పటికీ ఆ మహిళ తన గర్భాన్ని కొనసాగించడానికి నిరాకరించారు.
ధర్మాసనం అసంతృప్తి!
అయితే జస్టిస్ హిమా కోహ్లీ వ్యాఖ్యలతో విభేదిస్తున్నట్లు జస్టిస్ నాగరత్న తెలిపారు. సదరు వివాహిత నిర్ణయాన్ని గౌరవించాలని అన్నారు. దీంతో సుప్రీం ద్విసభ్య ధర్మాసనంలోనూ ఏకాభిప్రాయం రాలేదు. చివరకు ఈ కేసును విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలని సీజేఐకి సూచించింది. మరోవైపు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించడం పట్ల జస్టిస్ నాగరత్న ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
"ఒక ధర్మాసనం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు.. ఎటువంటి విజ్ఞప్తి లేకుండా సీజేఐ త్రిసభ్య ధర్మాసనం ముందు ఎలా అప్పీలు చేస్తారని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వమే ఇలా చేస్తే.. రేపు ప్రైవేటు పార్టీలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయి. సుప్రీంకోర్టులోని అన్ని ధర్మాసనాలు అత్యున్నతమైనవే" అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.
దేశంలో మహిళల గర్భ విచ్ఛిత్తి హక్కులపై ఇటీవలే సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. సురక్షితంగా, చట్టపరంగా 20 నుంచి 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కు మహిళలందరికీ ఉందని స్పష్టం చేసింది. దీని ప్రకారం, 24 వారాల్లోపై గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఉంటుంది. కానీ, ఈ కేసులో 25వారాలకు మించి కావడం వల్ల సదరు వివాహిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.