ETV Bharat / bharat

గోప్యత, విశ్వసనీయత కొందరికే- ఎన్నికల బాండ్లతో ఉన్న సమస్య ఇదే: సుప్రీంకోర్టు - సుప్రీంకోర్టు లేటెస్ట్​ న్యూస్​

Supreme Court On Electoral Bonds : ఎన్నికల బాండ్ల పథకం గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయని అభిప్రాయపడింది.

Supreme Court On Electoral Bonds
Supreme Court On Electoral Bonds
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 6:51 AM IST

Supreme Court On Electoral Bonds : రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పథకం గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోందని పేర్కొంది. ఎస్​బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారి తెలుసుకోగలరని, అదే విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుందని పేర్కొంది.

ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వరుసగా రెండో రోజు విచారణ కొనసాగింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధన ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దేశంలో అవినీతిని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానం అమలు సహా 2 లక్షల 38 వేల డొల్ల కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుందని తెలిపారు. స్వచ్ఛమైన డబ్బే పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం రూపంలో కేంద్రం మరో ప్రయత్నం చేసిందన్నారు. అయితే, అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయని.. దీనికి కారణమేమిటని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. బాండ్ల ద్వారా సమకూరిన మెుత్తం నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి, దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయవచ్చు కదా అని సూచించారు. అప్పుడు అసలు విరాళాలే రావని సొలిసిటర్ జనరల్ మెహతా అభిప్రాయపడ్డారు. ఈ కేసుపై ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి.

'స్వలింగ వివాహాల తీర్పును సమీక్షించండి'
SC On Same Sex Marriage : స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలైంది. పిటిషనర్లలో ఒకరైన ఉదిత్‌ సూద్‌.. ఈ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం రిజిస్ట్రీ ముందు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత నెల 17న ఇచ్చిన తీర్పులో ప్రత్యేక వివాహ చట్టం పరిధిలో స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వడానికి తిరస్కరించింది. ఇందుకు సంబంధించి చట్టంలో మార్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని అభిప్రాయపడింది.

Supreme Court On Divorce : 'భారతీయ సమాజంలో 'వివాహం' పవిత్రమైనది'.. విడాకుల కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

Information Commissions Vacancies : 'అలాగైతే ఆ చట్టం చనిపోయినట్లే'.. సమాచార కమిషన్లలో ఖాళీలపై సీజేఐ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.