ETV Bharat / bharat

'ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణ'.. సుప్రీం కీలక నిర్ణయం! - చీఫ్​జస్టిస్​ ఆఫ్​ ఇండియా

Supreme Court of India News: ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులపై సత్వర విచారణ జరిగేలా చూడాలని, సీబీఐ సహా ఇతర సంస్థల దర్యాప్తును వేగవంతం చేసేలా ఆదేశించాలన్న వ్యాజ్యాలపై ఈనెల 15 తర్వాత వాదనలు ఆలకించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ వ్యవహారంపై తక్షణమే వాదనలు వినాలన్న అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

సుప్రీంకోర్టు వార్తలు
author img

By

Published : Apr 8, 2022, 1:24 PM IST

Supreme Court of India News: ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల సత్వర విచారణకు సంబంధించిన వ్యాజ్యంపై ఏప్రిల్ 15 తర్వాత వాదనలు ఆలకిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై 2వేలకుపైగా కేసులు పెండింగ్​లో ఉన్నాయని, సంబంధిత వ్యాజ్యంపై తక్షణమే విచారణ జరపాలని కోరుతూ శుక్రవారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా. ప్రజాప్రతినిధులపై కేసుల వ్యవహారంలో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న ఆయన.. పెండింగ్ కేసులపై వెలువడిన తాజా నివేదికలోని గణాంకాలను ఉటంకించారు.

విజయ్ అభ్యర్థనపై జస్టిస్​ ఎన్​వీ రమణ, జస్టిస్​ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం స్పందించింది. "బయట ఆ కేసులు ఎన్నేళ్లు పెండింగ్​లో ఉన్నా ఫర్వాలేదు. కానీ సుప్రీంకోర్టుకు వస్తే మాత్రం అత్యవసరం అంటారు" అని వ్యాఖ్యానించింది. "ఇదొక ప్రజాప్రయోజన వ్యాజ్యం. దీనిపై మేము ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేశాం. అవి అమలు అవుతున్నాయి. దయచేసి వేచి ఉండండి. న్యాయమూర్తులు అందుబాటులో ఉన్నారా లేదా అన్నదే ఇక్కడ సమస్య. ఇప్పుడు ఈ కేసు కోసం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తే.. మరో రెండు బెంచ్​లలో మార్పులు చేయాల్సి వస్తుంది. శుక్రవారం రెండు ధర్మాసనాల్లో ఎలా మార్పులు చేయగలము?" అని విజయ్​ను ప్రశ్నించారు జస్టిస్ రమణ.

తక్షణ విచారణ జరపాలని విజయ్ మరోమారు అభ్యర్థించగా.. జస్టిస్ రమణ సానుకూలంగా స్పందించారు. ఏప్రిల్ 15 తర్వాత వాదనలు వింటామని చెప్పారు. అయితే ఈలోగా.. ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తుల బదిలీల కోసం వివిధ కారణాలతో వేర్వేరు హైకోర్టులు పెట్టుకున్న దరఖాస్తులను ఆమోదిస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

సుప్రీం వరుస ఆదేశాలు: ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణపై న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ కొంతకాలం క్రితం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ తర్వాత ఇదే అంశంపై సుప్రీంకోర్టు అనేక కీలక ఆదేశాలు జారీ చేసింది. చివరిసారిగా.. ఈ వ్యాజ్యాన్ని సాధ్యమైనంత త్వరగా విచారించే అంశాన్ని పరిశీలిస్తామని ఫిబ్రవరి 9న స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు మరోమారు ఆ వ్యాజ్యాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చిన విజయ్ హన్సారియా.. పెండింగ్ కేసులపై తాజా నివేదికను ప్రస్తావించారు. అందులోని కీలకాంశాలు ఇలా ఉన్నాయి..

  • దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,984 కేసులు ఉన్నాయి. ఇందులో 1,899 కేసులు ఐదేళ్లకుపైగా పెండింగ్​లో ఉన్నాయి.
  • 2018 డిసెంబర్​లో 4,110గా ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య 2020 అక్టోబర్​కు 4,859కి పెరిగింది.
  • 2018 డిసెంబర్​ 4 తర్వాత 2,775 కేసులు పరిష్కారమయ్యాయి. అయినా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు 4,122 నుంచి 4,984కు పెరిగాయి. అంటే.. చట్టసభల్లోకి నేరచరితుల రాక పెరిగింది. అందుకే పెండింగ్ కేసుల సత్వర విచారణ తక్షణావసరం.

ఇదీ చూడండి: Live Video: బావిలో పడ్డ చిరుత.. మంచం సాయంతో పైకి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.