ETV Bharat / bharat

'తాత్కాలిక చర్యలతో కాలుష్య నియంత్రణ కష్టం'

(supreme court delhi pollution)దిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రస్తుతం చేపట్టిన చర్యలు తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడతాయని వ్యాఖ్యానించింది. దిల్లీలో కాలుష్య సమస్యపై ఇప్పట్లో విచారణ ఆపబోమని తేల్చిచెప్పింది.

supreme court, సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు
author img

By

Published : Nov 24, 2021, 3:50 PM IST

దిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం తాత్కాలిక చర్యలు మాత్రమే చేపట్టిందని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు శాస్త్రీయ పరిశోధన జరిపి గణాంకాల ఆధారంగా మోడల్​ను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. రాష్ట్రాల కార్యదర్శులతో సమావేశం నిర్వహించి అత్యవసర చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. దేశ రాజధానిలో వాయుకాలుష్యంపై బుధవారం మరోసారి విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్దేశించింది(supreme court delhi pollution).

గాలి దిశ కారణంగా దిల్లీలో కాలుష్యం తగ్గిందని, రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే వాటర్ స్ప్రింక్లర్ల ఏర్పాటు వంటి తాత్కాలిక చర్యలు చేపట్టారని జస్టిస్ డీవై చంద్రచూడ్ గుర్తు చేశారు​. శాస్త్రీయ ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిందని పేర్కొన్నారు(delhi air pollution).

'కాలుష్య తీవ్రత ఈ స్థాయికి చేరుతుందని వాతావరణ మార్పులను ముందే అంచనా వేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాలుష్య స్థాయి సీజన్​ను బట్టి మారుతుంది. ఒక ప్రామాణికాన్ని నిర్ణయించాలి. గత ఐదేళ్లలో సీజన్ల వారీగా గణాంకాలను పరిశీలించి విధానాన్ని సిద్ధం చేయాలి. కాలుష్య స్థాయి అన్ని నెలలు ఒకేలా ఉండదు. నవంబర్​లో ఉన్నట్లు మే నెలలో ఉండదు. దేశ రాజధానిలో ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకునే పరిస్థితి రాని విధంగా చర్యలు ఉండాలి' అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు(supreme court on delhi pollution).

దిల్లో కాలుష్య తీవ్రత ఉన్నంత వరకు ఈ విషయంపై తాము విచారణ జరుపుతూనే ఉంటామని సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ స్పష్టం చేశారు.

అంతేగాక ప్రజలు ఆకలితో అలమటించకుండా విద్యుత్, ప్లంబింగ్ వంటి అంతర్గత కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సీజేఐ సూచించారు. నిర్మాణ పనులపై నిషేధం విధించినందున దినసరి కూలీలకు సాయం చేసేందుకు కార్మిక సంక్షేమ నిధులను ఉపయోగించాలన్నారు. పనులు తిరిగి ప్రారంభమయ్యేంతవరకు వారికి అండగా ఉండాలని నిర్దేశించారు(supreme court air pollution case).

పంట వ్యర్థాల దహనంపై పంజాబ్, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వాలు ఏమైనా పరిశోధనలు జరిపాయా? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించి క్షేత్ర స్థాయిలో రైతులతో మాట్లాడి శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని పరిష్కారాన్ని రూపొందించాలని చెప్పింది(supreme court on stubble burning). ఈనెల 29న మరోసారి దిల్లీ కాలుష్యంపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఎంఎస్​పీ చట్టం కోసం పార్లమెంటుకు రైతుల ట్రాక్టర్ ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.