ETV Bharat / bharat

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

author img

By

Published : May 5, 2021, 4:39 PM IST

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సర్కార్‌ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 16 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. మరాఠా రిజర్వేషన్లు 'రాజ్యాంగ విరుద్ధం'గా అభివర్ణించింది. 1992 మండల్​ తీర్పులో.. రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఇది అధిగమించిందని స్పష్టం చేసింది.

supreme court
సుప్రీంకోర్టు

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మహరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. మరాఠా రిజర్వేషన్లు.. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.

ఆ తీర్పుపై ప్రభావం ఉండదు..

2018లో మరాఠాలకు మహారాష్ట్ర సర్కార్‌ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 16 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. దీన్ని వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన కోర్టు రిజర్వేషన్లను సమర్థిస్తూ 2019లో తీర్పు వెలువరించింది. అయితే, కోటాను 16 శాతం నుంచి విద్యాసంస్థల ప్రవేశాల్లో 12 శాతానికి, ఉద్యోగ నియామకాల్లో 13 శాతానికి తగ్గించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
అలాగే, ఈ కోటా కింద ఇప్పటికే చేపట్టిన నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాలపై తాజా తీర్పు ప్రభావం ఉండబోదని.. వాటిని అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. పీజీ మెడికల్‌ కోర్సుల్లో మునుపటి ప్రవేశాలు కొనసాగుతాయని వెల్లడించింది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది.

మండల్​ తీర్పు పరిశీలన అవసరం లేదు

మండల్‌ తీర్పుగా పేరొందిన ఇందిరా సాహ్నీ తీర్పు (1992)ను పునఃసమీక్షించాల్సిన అసవరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1992లో ఇచ్చిన మండల్ తీర్పు ప్రకారం.. రాష్ట్రాలు 50 శాతం రిజర్వేషన్లను అధిగమించరాదు. చాలా సందర్భాల్లో మండల్ తీర్పును విచారించామని స్పష్టం చేసింది. జస్టిస్​ అశోక్​ భూషణ్​తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

మరాఠా రిజర్వేషన్లను సిఫార్సు చేసిన ఎంసీ గైక్వాడ్ కమిషన్​ రిపోర్టును పరిశీలించిన ధర్మాసనం.. రిజర్వేషన్లు కల్పించేందుకు బలమైన కారణాలు ఏమీ రిపోర్టులో తెలియపరచలేదని పేర్కొంది.

జస్టిస్​ ఎల్​ఎన్​ రావ్​, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్​ రవీంద్ర భట్​.. మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తూ తీర్మానించగా.. జస్టిస్ భూషణ్​, జస్టిస్ ఎస్​ఏ అబ్దుల్ నజీర్​ రిజర్వేషన్లను సమర్థించారు.

రాష్ట్రాలకు హక్కులేదు..

ఆర్థిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా మారాఠాలకు రిజర్వేషన్‌ కల్పించారని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. గతంలో పార్లమెంటు చేసిన ఓ సవరణ ప్రకారం.. ఒక వర్గాన్ని సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన జాబితా (ఎస్‌ఈబీసీ) లో చేర్చే హక్కు రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. రాష్ట్రాలు కేవలం ఆయా వర్గాలను గుర్తించి కేంద్రానికి సిఫార్సు మాత్రమే చేయాలని.. అనంతరం రాష్ట్రపతి వాటిని వెనుకబడిన వర్గాల జాబితాలో చేరుస్తారని వివరించింది.

అయితే జస్టిస్ భూషణ్​, జస్టిస్ ఎస్​ఏ అబ్దుల్ నజీర్​ మాత్రం.. ఎస్‌ఈబీసీ జాబితాను రూపొందించే హక్కు కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకూ ఉంటుందన్నారు.

నూతన ఎస్‌ఈబీసీ జాబితా?

ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు.. ఎస్‌ఈబీసీ జాబితాను పరిశీలించి.. తాజా జాబితాను రూపొందించాలని కేంద్రానికి సూచనలు చేశారు. అప్పటివరకు ప్రస్తుతమున్న జాబితానే పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.

సుప్రీం తీర్పుపై వారి స్పందనేంటి ?

న్యాయపోరాటం చేస్తాం..

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే అభిప్రాయం వ్యక్తం చేశారు.

"మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం నిర్ణయం దురదృష్టకరం. విజయం సాధించేంత వరకు న్యాయపోరాటం చేస్తాం. ప్రధానిని, రాష్ట్రపతిని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. మరాఠా రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోండి. ఇదే విషయంపై ప్రధానితో చర్చించేందుకు భాజపా ఎంపీ ఛత్రపతి సంభాజీరాజే ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నారు.. కానీ ప్రధానిని కలిసేందుకు అనుమతి దొరకటం లేదు. "

-- ఉద్ధవ్​ ఠాక్రే , మహారాష్ట్ర ముఖ్యమంత్రి

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు మాకు నిరాశ కలింగించింది. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా దృష్టి సారించలేదు.

-- దేవేంద్ర ఫడణవీస్, భాజపా నేత

"ఈ కేసును బాంబే హైకోర్టులో సమర్థంగా నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం ధర్మాసనం ముందు విఫలం అయింది. ఈ తీర్పు మరాఠా వర్గానికి పెద్ద షాక్ లాంటిది."

-- వినోద్ పాటిల్, పిటిషనర్

"మేము సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రిజర్వేషన్లు అడిగేవారికి ఇదో పెద్ద షాక్. సుప్రీంకోర్టు.. సామాజిక న్యాయాన్నే అమలు పరిచింది."

-- గుణ్​​రతన్ సదవర్తే, న్యాయవాది

ఇదీ చదవండి : 'అధికారుల్ని జైల్లో వేస్తే ఆక్సిజన్​ వస్తుందా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.