ETV Bharat / bharat

ఆ ఆదేశాలు సహేతుకంగా ఉండాలి: సుప్రీంకోర్టు

కరోనా మహమ్మారిని కారణంగా చూపి ముందస్తు బెయిల్​ మంజూరు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ వ్యక్తి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అంతేగాక ఇటీవల ఈ అంశంపై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

supreme court
సుప్రీంకోర్టు
author img

By

Published : May 29, 2021, 5:57 AM IST

Updated : May 29, 2021, 6:24 AM IST

ఓ వ్యక్తి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చుతూనే అరెస్టు నుంచి రక్షణ కల్పించేలా న్యాయస్థానాలు జారీచేసే ఆదేశాలు హేతుబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. అరెస్టు భయంతో బెయిలు కోసం చేసుకొనే దరఖాస్తును తిరస్కరిస్తూనో లేదా ఆమోదిస్తూనో తీసుకొనే నిర్ణయం ఆ వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కులపై నేరుగా ప్రభావం చూపుతుంది కనుక అలాంటి ఆదేశాలిచ్చే సమయంలో దర్యాప్తు సంస్థలు, ఫిర్యాదుదారు, సమాజ ఆందోళనలనూ సమతూకంతో చూడాలని పేర్కొంది.

రెండు వ్యాజ్యాల్లో ముందస్తు బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తూనే 90 రోజుల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పించడంతో పాటు ట్రయల్‌ కోర్టులో లొంగిపోయి రెగ్యులర్‌ బెయిల్‌ను కోరాలంటూ అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలిచ్చింది. వీటిని సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేయగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 'ముందస్తు బెయిల్‌ కేసుల విచారణలో కోర్టులు ఎదుర్కొనే ప్రత్యేక పరిస్థితులను విస్మరించలేం. నిందితుడికి ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయడం ఇష్టంలేకపోయినా ప్రత్యేక పరిస్థితుల్లో ఆ వ్యక్తి హక్కులను ట్రయల్‌ కోర్టులో లొంగిపోయే వరకూ కాపాడటం అవసరమనే అభిప్రాయంతో అరెస్టు నుంచి రక్షణ కల్పించాల్సి రావచ్చు' అని 18 పేజీల తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

'ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో న్యాయం చేసే అధికారం హైకోర్టుకు లేదని చెప్పలేం. అయితే, ఇష్టారీతిగా ఆ విచక్షణాధికారాన్ని ఉపయోగించకూడదు. నేర శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 438, సెక్షన్‌ 438(1)ను పరిగణనలోకి తీసుకుంటూ, దర్యాప్తు సంస్థలు, ఫిర్యాదుదారులు, సమాజం ఆందోళనలను సమదృష్టితో చూడాలి' అని స్పష్టం చేస్తూ నిందితుడికి అలహాబాద్‌ హైకోర్టు కల్పించిన ఉపశమనాన్ని రద్దు చేసింది. నిందితుడికి 90 రోజుల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి గల కారణాలను పేర్కొనలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. హైకోర్టు తీవ్ర తప్పిదానికి పాల్పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇవీ చదవండి: కొవిడ్​ బాధితులకు పరిహారంపై కేంద్రానికి కీలక ఆదేశాలు!

'కరోనా కారణంతో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు'

Last Updated : May 29, 2021, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.