ETV Bharat / bharat

సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు.. కొలీజియం సిఫార్సు

Supreme Court Collegium: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవులకు ఇద్దరి పేర్లను సిఫార్సు చేసింది కొలీజియం. ఇందులో గువాహటి, గుజరాత్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జంషెడ్‌ బి.పర్దీవాలా భవిష్యత్తులో సీనియార్టీ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Supreme Court Collegium
సుప్రీంకోర్టు కొలీజియం
author img

By

Published : May 6, 2022, 7:40 AM IST

Supreme Court Collegium: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవులకు కొలీజియం ఇద్దరు పేర్లను సిఫార్సు చేసింది. ఇందులో ఒకరు గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుధాంశు ధులియా, మరొకరు గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జంషెడ్‌ బి.పర్దీవాలా. కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులకు ఆమోదముద్ర వేసి వీరిద్దర్నీ న్యాయమూర్తులుగా నియమిస్తే జస్టిస్‌ పర్దీవాలా భవిష్యత్తులో సీనియార్టీ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈయన గుజరాత్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ బర్జోర్జి పర్దీవాలా కుమారుడు. మైనార్టీ (పార్సీ) కమ్యూనిటీకి చెందిన న్యాయమూర్తికి పదోన్నతి లభించడం 5 ఏళ్ల విరామం తర్వాత ఇదే తొలిసారి. 2017 ఫిబ్రవరిలో చివరిసారిగా జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌కు ఆ అవకాశం దక్కింది.

ప్రస్తుత న్యాయమూర్తుల్లో సీనియారిటీపరంగా చివరన ఉన్న జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా 2027 అక్టోబర్‌లో సీజేఐగా బాధ్యతలు చేపట్టి 2028 మే 3వ తేదీ వరకు ఆ స్థానంలో కొనసాగుతారు. ఆ తర్వాత జస్టిస్‌ పర్దీవాలా ఆ స్థానంలోకి వచ్చి 2 ఏళ్ల మూడునెలలు కొనసాగే అవకాశం ఉంది. కొలీజియం సిఫార్సు చేసిన జస్టిస్‌ సుధాంశు ధులియా ఉత్తరాఖండ్‌నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కాబోయే రెండోవ్యక్తి.

త్వరలో పూర్తిస్థాయి న్యాయమూర్తులతో సుప్రీం: ప్రధాన న్యాయమూర్తి సహా 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన సుప్రీంకోర్టులో ప్రస్తుతం 32 మంది సేవలందిస్తున్నారు. ఈ ఇద్దరి నియామకం పూర్తయితే ఆ సంఖ్య 34కి చేరుతుంది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడాది ఆగస్టు 31వ తేదీన ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో సహా మొత్తం 9 మంది న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఈ రెండింటి నియామకాలు జరిగితే ఆ సంఖ్య 11కి చేరుతుంది. 5గురు సభ్యుల కొలీజియంలో ఏకాభిప్రాయం సాధించి ఏడాదిలోపు 11 మంది న్యాయమూర్తులను సిఫార్సు చేసినట్లవుతుంది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన కొలీజియం గత ఏడాదికాలంలో హైకోర్టులకు పది మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించింది. ఇందులో టాప్‌3తో కూడిన కొలీజియం వివిధ హైకోర్టులకు 180 పేర్లను సిఫార్సు చేసింది. అందులో 126 నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. 2022లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో మొత్తం ఏడుగురు పదవీ విరమణ చేయనున్నారు. ఆ జాబితాలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణతోపాటు, ఆయన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వినీత్‌శరణ్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్త ఉన్నారు. ఇందులో జస్టిస్‌ వినీత్‌శరణ్‌ ఇప్పటికే రావి-బియాస్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

ఇదీ చదవండి: ఆ​ విద్యార్థులకు 'సీఎం' బంపర్​ ఆఫర్​.. హెలికాప్టర్​లో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.