Sukumara Kurup: చాకో హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సుకుమార కురూప్.. గుజరాత్లో స్వామీజీ అవతారంలో జీవిస్తున్నాడని కేరళ పథానంథిట్టకు చెందిన వ్యక్తి పోలీసులకు చెప్పాడు. అతడు చూడటానికి అచ్చం కురూప్ లాగే ఉన్నాడని పేర్కొన్నాడు. పోలీసులు కురూప్ కోసం 38 ఏళ్లుగా గాలిస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదు.
పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరు రేంజీ ఇస్మాయిల్. కేరళలో కూల్‌డ్రింక్స్ స్టోర్‌కు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 2007లో గుజరాత్లో తాను ఓ స్వామీజీని కలిశానని, అతడు అచ్చం కురూప్ లాగే ఉన్నాడని తెలిపాడు. ఆయన పేరు శంకర గిరి అని తనతో చెప్పాడని పేర్కొన్నాడు. తాను అక్కడ టీచ్గాగా పని చేశానని వివరించాడు. నెల రోజుల అనంతరం పేపర్లో కురూప్ ఫొటో చూసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించాడు. అయితే వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నాడు.
ఇప్పుడు మరోసారి కురూప్ తనకు కనిపించాడని ఇస్మాయిల్ చెబుతున్నాడు. గతేడాది డిసెంబర్లో హరిద్వార్‌లో కురూప్ను ట్రావెల్ వ్లాగ్‌లో చూశానని తెలిపాడు. అనుమానం వచ్చి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీఎం పినరయి విజయన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వివరించాడు.
ఇస్మాయిల్ సమాచారం అనంతరం కురూప్ కేసు దర్యాప్తును గుజరాత్‌లోనూ జరపాలని క్రైంబ్రాంచ్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
1984లో జరిగిన చాకో హత్య ఘటన కేరళలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకుమార కురూప్ కోసం పోలీసులు 38 ఏళ్లుగా గాలిస్తున్నారు. కేరళ చరిత్రలోనే అత్యధిక కాలం పెండింగ్‌లో ఉన్న కేసు ఇదే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: విస్తృత ధర్మాసనానికి హిజాబ్ కేసు- కళాశాలల బంద్‌తో కాస్త ప్రశాంతత!