Sukma Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సుక్మాలో మరోసారి కాల్పుల మోత మోగింది. శుక్రవారం.. భద్రతా దళాలకు నక్సల్స్‌కు మధ్య జరిగిన కాల్పుల్లో వీరేంద్ర సంగ్ అనే జవాను ప్రాణాలు కోల్పోయారు. వీరేంద్ర సింగ్.. 'కోబ్రా' 208 బెటాలియన్‌కు కమాండోగా సేవలు అందిస్తున్నారు.
నక్సల్స్ ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతానికి చేరుకున్న దళాలపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో గాయపడిన వీరేంద్ర సింగ్.. మృతిచెందారు.
అనుమానం వచ్చి..
రాజనంద్‌గావ్‌లోని నిదేలీలో తిజురామ్ అనే గ్రామస్థుడిని నక్సల్స్ హతమార్చారు. అతను పోలీస్ ఇన్ఫార్మర్ అని వారు అనుమానించడమే అందుకు కారణం. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు ఐదుగురు నక్సలైట్లు తిజురామ్ ఇంటికి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి : ' ప్రేమ పెళ్లిళ్లు అమ్మాయిలకు ప్రమాదకరం'