ETV Bharat / bharat

Punjab New CM: పంజాబ్​ నూతన సీఎం ఆయన కాదు - సుఖ్​జిందర్ సింగ్ రంధావా

Sukhjinder Singh Randhawa will be the new Chief Minister of Punjab
పంజాబ్​ నూతన సీఎంగా సుఖ్​జిందర్ సింగ్ రంధావా!
author img

By

Published : Sep 19, 2021, 3:23 PM IST

Updated : Sep 19, 2021, 6:11 PM IST

15:16 September 19

పంజాబ్​ నూతన సీఎం ఆయన కాదు

పంజాబ్​​ నూతన సీఎంగా(Punjab New CM) సుఖ్​జిందర్​ సింగ్ రంధావా(Sukhjinder Singh Randhawa) పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసిందని తొలుత వార్తలొచ్చాయి. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి అందరి ఆ ఆమోదంతో ఈ ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అనూహ్యంగా యువనేత చరణ్​జీత్​ సింగ్​ సన్నీకి కాంగ్రెస్ అధిష్ఠానం సీఎంగా  అవకాశం ఇచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్ సింగ్ రావత్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

అయితే పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సుఖ్​జిందర్ తెలిపారు. చరణ్​జీత్ సింగ్ తనకు సోదరుడి లాంటి వాడని పేర్కొన్నారు.

ఇద్దరు డిప్యూటీ సీఎంలు

నూతన సీఎంతో పాటు ఈసారి ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఒక హిందు ఎమ్మెల్యే, మరొక దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఆ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవికి కాంగ్రెస్ సీనియర్​ నాయకురాలు అరుణా చౌధరి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్.. శనివారం రాజీనామా చేశారు. పార్టీలో అవమానం భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

పంజాాబ్ మాజీ మంత్రి నవ్​జ్యోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య గతకొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ వివాదం ముదిరే పార్టీలో సంక్షోభం(Punjab Congress Crisis) తలెత్తింది. ఈ నేపథ్యంలో అమరీందర్ రాజీనామా చేశారు.

Last Updated : Sep 19, 2021, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.