ETV Bharat / bharat

గులాబ్​ జామూన్​ పరాఠా.. ఇది వింతా? వెగటా?

author img

By

Published : Mar 6, 2022, 11:08 AM IST

Gulab Jamun Paratha: కుర్​కురే మిల్క్​షేక్, దోశా ఐస్​క్రీమ్​, పెరుగు మ్యాగీ.. ఇలాంటి విచిత్రమైన వంటకాల పేర్లు వినగానే వెగటు.. ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే 'కొత్త' కోసం చేసే ప్రయత్నాలు ఎప్పటికీ ఆగవుగా. దాని నుంచి కొన్నిసార్లు అద్భుతమైన రుచులూ బయటకు రావొచ్చు! ఈ జాబితాలో అలా వచ్చి చేరిందే గులాబ్​ జామూన్​ పరాఠా.

viral video
Gulab Jamun Paratha

Gulab Jamun Paratha: వెరైటీ.. దుస్తుల్లో.. వస్తువుల్లో.. వంటకాల్లో..! ఇప్పుడు అందరూ ఏదైనా భిన్నంగా ఉండాలనే కోరుకుంటారు. అందుకోసం చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించవచ్చు లేదా బెడిసికొట్టొచ్చు. ఈ క్రమంలో ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్న ఓ వంట వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. అదే గులాబ్​ జామూన్​ పరాఠా.

ఈ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో ఫుడ్​ బ్లాగర్​ సోనియా నేగి షేర్​ చేశారు. అందులో ఓ వీధి వ్యాపారి పరాఠాలో గులాబ్​ జామూన్​ పెట్టి.. దానిని నెయ్యిలో వేయిస్తాడు. ఆ తర్వాత దానిపై గులాబ్​ జామూన్​ రసం వేసి ఇస్తాడు. "నిజానికి నేను కూడా ముందు షాక్ అయ్యాను. కానీ, అది (గులాబ్​ జామూన్​ పరాఠా) చాలా బాగుంది" అని సోనియా కామెంట్​ చేశారు.

అయితే ఈ వీడియోకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ విచిత్ర వంటకాన్ని చూసి కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు దానిని ట్రై చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు కామెంట్ చేశారు.

ఇదీ చూడండి: Maggi: మ్యాగీని ఇలా కూడా తింటారా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.