ETV Bharat / bharat

'ఆ వ్యాక్సిన్​ను నిల్వ చేయటం పెద్ద సవాలే' - కరోనా వ్యాక్సిన్​ను నిల్వ చేయటం సవాల్

ఫైజర్ ఫార్మా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్​​ను నిల్వ చేయటం చాలా దేశాలకు సవాల్​ లాంటిదని నీతిఆయోగ్​ సభ్యులు డా. వీకే పాల్​ తెలిపారు. భారత్​లో ఈ వ్యాక్సిన్​ను నిల్వ చేయటంపై కేంద్రం పరిశీలిస్తోందన్నారు. మరోవైపు కరోనా టీకాను అందరికీ అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని సైతం రూపొందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్​ భూషణ్ వివరించారు.

Storage of Pfizer's COVID vaccine challenge for most nations; India examining possibilities
'ఆ వ్యాక్సిన్​ను నిల్వ చేయటం చాలా దేశాలకు సవాల్'
author img

By

Published : Nov 18, 2020, 5:04 AM IST

అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ తయారు చేస్తున్న కరోనా టీకాను -70డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయటం చాలా దేశాలకు పెను సవాల్​ అని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్​. వీకే పాల్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్​ భూషణ్​తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీకాను భారత్​లో నిల్వచేయటం సాధ్యపడుతుందా? లేదా? అన్న విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందన్నారు.

"ఫైజర్​, మోడర్నా వ్యాక్సిన్​ల అభివృద్ధిని పరిశీలిస్తున్నాం. వారు ప్రాథమిక ఫలితాలను అందిచారు. కానీ ఇంకా టీకాలకు అనుమతి లభించలేదు. వ్యాక్సిన్​లు ​ మనదేశంలోకి రావటానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది."

---- డాక్టర్​. వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యులు.

వివిధ దశల్లో ..

మరోవైపు దేశంలో వివిధ దశల్లో క్లినికల్ ట్రయల్స్​ జరుపుకుంటున్న వ్యాక్సిన్​లపై పాల్​ ఆశాభావం వ్యక్తం చేశారు. సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ రూపొందిస్తున్న ఆక్స్​ఫోర్డ్ వ్యాక్సిన్ మూడో దశలో ఉందని తెలిపారు. భారత్​ బయోటెక్​, ఐసీఎమ్ఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్​ మూడో దశ ప్రయోగాలు ప్రారంభమయ్యాయని వివరించారు.

దేశీయ వ్యాక్సిన్​ జైడస్ క్యాండిలా రెండో దశ పూర్తి చేసుకుందని తెలిపారు. రష్యా టీకా స్పుత్నిక్ వీ రెండు, మూడు దశల పరీక్షలు రెడ్డీస్​ లాబొరేటరీస్​లో జరుగుతాయన్నారు.

అందరికీ వ్యాక్సిన్

ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ తెలిపినట్లుగా టీకా రాగానే దేశప్రజలందరికీ వ్యాక్సిన్​ను అందజేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్​ భూషణ్ తెలిపారు. దీనికోసం కొవిడ్​-19టీకా పంపిణీ పథకాన్ని సైతం రూపొందించామని వెల్లడించారు. ఈ పథకంపై ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సలహాలను తీసుకుంటున్నామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.